మహేష్ బాబుకి ఇష్టం లేకపోయినా ఆ టాటూ వేయించుకొని షాక్ ఇచ్చిన నమ్రత!

April 13, 2024

మహేష్ బాబుకి ఇష్టం లేకపోయినా ఆ టాటూ వేయించుకొని షాక్ ఇచ్చిన నమ్రత!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు నమ్రత జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వయసులో నమ్రత మహేష్ బాబు కంటే పెద్దది అయినప్పటికీ వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇలా పెళ్లి తర్వాత వీరిద్దరూ కూడా వారి వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇలా మహేష్ బాబు వృత్తిపరమైనటువంటి జీవితంలో ఎంతో బిజీగా ఉండగా నమ్రత మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ తన పిల్లలు అలాగే వ్యాపారాలను చూసుకుంటూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈ జంట ఎంతో మందికి ఆదర్శమని చెప్పాలి. ఇకపోతే నమ్రత మహేష్ బాబు కంటే వయసులో పెద్దది అయినప్పటికీ ఆయనకు నచ్చని పనులు ఏవి కూడా చేయదు కానీ ఒక విషయంలో మాత్రం మహేష్ బాబు ఆగ్రహానికి నమ్రత గురి అయ్యారని చెప్పాలి. మహేష్ బాబుకి టాటూలు వేయించుకోవడం అంటే ఏమాత్రం ఇష్టం ఉండదట కానీ మహేష్ బాబుకి ఇష్టం లేకపోయినా ఈమె మాత్రం తన చాతి మీద ఒక పేరు టాటూగా వేయించుకొని ఒక్కసారిగా మహేష్ బాబుకి షాక్ ఇచ్చిందని చెప్పాలి.

మరి ఈమె టాటూ వేయించుకున్నటువంటి ఆ పేరు ఎవరిది అసలు ఎందుకు వేయించుకుందనే విషయానికి వస్తే మహేష్ అంటే ఎంతో ప్రేమ ఉన్నటువంటి ఈమె తనకు ఇష్టం లేకపోయినా తన భర్త పేరును తన చాతిపై టాటూగా వేయించుకున్నారట. అయితే ఈ విషయం తెలిసినటువంటి మహేష్ బాబు ఒక్కసారిగా నమ్రతపై సీరియస్ అయ్యారని తెలుస్తుంది. కాకపోతే తన భర్త పై ఎంత ప్రేమ ఉందనే విషయాన్నితెలియజేయడానికి మహేష్ బాబు కు ఇష్టం లేకపోయినా ఇలాంటి పని చేశారని తెలుస్తోంది.

ఇలా ఈమె తన చాతిపై టాటూ వేయించుకున్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మహేష్ అంటే నమ్రతకు ఉన్నటువంటి ప్రేమ తెలిసి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన రాజమౌళి దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిన త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి.

https://telugu.chitraseema.org/what-did-priyamanis-did-with-her-first-remuneration-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%af%e0%b0%ae%e0%b0%a3%e0%b0%bf-%e0%b0%ab%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b0%e0%b1%86/

ట్రెండింగ్ వార్తలు