మేము పొలిటికల్ కమెడియన్స్ కాదు.. ప్రొఫెషనల్ కమెడియన్స్.. వైసిపి లీడర్స్ పై ఆది సెటైర్స్!

April 13, 2024

మేము పొలిటికల్ కమెడియన్స్ కాదు.. ప్రొఫెషనల్ కమెడియన్స్.. వైసిపి లీడర్స్ పై ఆది సెటైర్స్!

హైపర్ ఆది ప్రస్తుతం జనసేన పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గంలో గత మూడు రోజుల నుంచి ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి ఈయన మీడియా సమావేశంలో కూడా పాల్గొని సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మీడియా సమావేశంలో భాగంగా వైసిపి నాయకులను ఉద్దేశించి పొలిటికల్ కమెడియన్స్ అంటూ కామెంట్స్ చేయడంతో ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ అవుతున్నాయి.

పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి ఆది మీడియా సమావేశంలో మాట్లాడుతూ పిఠాపురంలో జనసేన గెలుపు ఖాయమైందని లక్ష మెజారిటీతో తప్పకుండా గెలుస్తారని తెలిపారు. ఈ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతున్నారు.ఇలా పవన్ కళ్యాణ్ కు ఇంతలా సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి వర్మ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు అంటూ ఆది తెలిపారు.

ఇక తాము కేవలం పిఠాపురంలో మాత్రమే కాకుండా జనసేన పోటీ చేస్తున్నటువంటి అన్ని నియోజకవర్గాలలో కూడా ప్రచార కార్యక్రమాలను నిర్వహించి జనసేనని గెలిపించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలియజేశారు అయితే ఈ సమావేశంలో భాగంగా రిపోర్టర్ ఆదిని ప్రశ్నిస్తూ మీరు ప్రచారానికి రావడంతో కమెడియన్స్ ప్రచారం చేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు ఈ కామెంట్లపై మీ స్పందన ఏంటని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు ఆది సమాధానం చెబుతూ మేము వృత్తిపరంగా కమెడియన్ మేము ప్రొఫెషనల్ కమెడియన్స్ వారిలాగా పొలిటికల్ కమెడియన్స్ కాదు మేము అంటూ ఈ సందర్భంగా హైపర్ ఆది వైసిపి నాయకులపై సెటైర్స్ వేస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈయన అధికారపక్ష నేతల పట్ల ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ జనసేన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

https://telugu.chitraseema.org/%e0%b0%ae%e0%b0%b9%e0%b1%87%e0%b0%b7%e0%b1%8d-%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81%e0%b0%95%e0%b0%bf-%e0%b0%87%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b0%82-namrata-got-a-tattoo-on-his-hand-against-maheshs-w/

ట్రెండింగ్ వార్తలు