సెల్ఫీ అంటూ ఎగబడిన అభిమాని.. మరోసారి చేయి చేసుకున్న బాలయ్య?

April 13, 2024

సెల్ఫీ అంటూ ఎగబడిన అభిమాని.. మరోసారి చేయి చేసుకున్న బాలయ్య?

నందమూరి బాలకృష్ణకు కాస్త కోపం ఎక్కువ అనే సంగతి మనకు తెలిసిందే. అభిమానులు తన ఎదుట ఎవరైనా కాస్త తోక విప్పితే వారికి దబిడి దిబిడే అంటూ వారిపై చేయి చేసుకుంటూ ఉంటారు ఇలా ఎన్నో సందర్భాలలో అభిమానులపై చేయి చేసుకున్నటువంటి బాలయ్య తాజాగా మరోసారి తన అభిమాని పై చేయి చేసుకున్నటువంటి ఘటన చోటుచేసుకుంది.

తాజాగా ఈయన హిందూపురం నియోజకవర్గం నుంచి ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి బాలయ్య నేటి నుంచి హిందూపురంలో బస్సు యాత్ర అంటూ ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ ప్రచార కార్యక్రమాలలో భాగంగా నేడు ఉదయం ఈయన సత్యసాయి జిల్లాకు చేరుకున్నారు.

కదిరి వరకు హెలికాఫ్టర్లు వచ్చినటువంటి బాలయ్య అక్కడి నుంచి బస్సులో తన యాత్ర ప్రారంభించబోతున్నారు అయితే ఈయన హెలికాప్టర్ దిగగానే అభిమానులు పెద్ద ఎత్తున బాలకృష్ణని చూడటం కోసం అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఒక అభిమాని కాస్త అత్యుత్సాహం చూపెడుతూ బాలయ్యతో సెల్ఫీ దిగాలనీ ఆరాటపడ్డారు. అయితే బాలయ్య అభిమాని పై ఏకంగా చేయి చేసుకోవడంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ షాక్ అయ్యారు.

ఇలా అభిమానిని కొట్టడమే కాకుండా ఇతర అభిమానులపై కూడా ఈయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా మొదటి రోజే బాలయ్య ఇలా అసహనం వ్యక్తం చేయడంతో అభిమానులు కూడా కాస్త చిన్నబుచ్చుకున్నారు. అయితే బాలకృష్ణ అభిమానులను కొట్టడానికి గల కారణాలు పలు సందర్భాలలో వెల్లడించారు .అలా ఒకరిని కొడితే అందరూ సెట్రైట్ అవుతారని లేదంటే తన బౌన్సర్లు వారిపై చేయి చేసుకోవాల్సి ఉంటుందని తన బౌన్సర్లతో అభిమానులను కొట్టించడం ఇష్టం లేకే తానే అలా ప్రవర్తిస్తానంటూ బాలయ్య చెప్పిన సంగతి తెలిసిందే.

https://telugu.chitraseema.org/dil-raju-must-not-be-admired/

ట్రెండింగ్ వార్తలు