తండ్రి కాబోతున్న హీరో ఆది పినిశెట్టి… వైరల్ అవుతున్న ఫోటో!

April 5, 2024

తండ్రి కాబోతున్న హీరో ఆది పినిశెట్టి… వైరల్ అవుతున్న ఫోటో!

సినీ ఇండస్ట్రీలో హీరో ఒక పలు సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో ఆది పినిశెట్టి ఒకరు. ఈయన తమిళనాడు అయినప్పటికీ తెలుగులో కూడా పలు సినిమాలలో నటించారు. అయితే హీరోగా మాత్రమే కాకుండా ఈయన విలన్ పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. రేసుగుర్రం సినిమాలో విలన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించినటువంటి ఆది పినిశెట్టి ప్రస్తుతం తమిళ తెలుగు భాష చిత్రాలలో నటిస్తున్నారు.

ఇక ఈయన ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూనే మరో నటి నిక్కి గల్రానీ ప్రేమలో పడ్డారు. ఇక వీరిద్దరూ పెద్దల సమక్షంలో గత మూడు సంవత్సరాల క్రితం ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇక ఈ వివాహం తర్వాత తిరిగి ఆయన తన సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఆది పినశెట్టి నిక్కి ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇకపోతే తాజాగా వీరిద్దరూ కలిసి ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా త్వరలోనే వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారంటూ ఈ వార్తను నేటిజన్స్ మరింత వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటోలలో నిక్కి పొట్ట కాస్త పెద్దదిగా కనిపించడంతో నిక్కీ ప్రెగ్నెంట్ అంటూ పెద్ద ఎత్తున వార్తలను వైరల్ చేస్తున్నారు. ఇలా ఈమె బేబీ బంప్ తో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నామని విషయాన్ని ఇలా చెప్పకనే చెబుతున్నారు అంటూ అభిమానులు కూడా ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

మరి ఆది పినిశెట్టి నిక్కి తల్లిదండ్రులు కాబోతున్నారంటూ వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజము ఉందో తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం ఈ వార్త వైరల్ అవుతుంది. ఇక ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే ఈ విషయం గురించి వీరిద్దరూ స్పందించాల్సిన అవసరం ఉంది.

Read More: ఇదే నా ఆఖరి సినిమా.. మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్!

ట్రెండింగ్ వార్తలు