Abhiram Daggubati: `అహింస` అంటూ హింస‌ను చూపించిన ద‌ర్శ‌కుడు తేజ‌

February 22, 2022

Abhiram Daggubati: `అహింస` అంటూ హింస‌ను చూపించిన ద‌ర్శ‌కుడు తేజ‌

తేజ దర్శకత్వంలో అభిరామ్ సినిమా రూపొందుతోందనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. అప్ప‌ట్లో మ్యూజిక్ సిట్టింగ్స్ మిన‌హా ఈ సినిమాకు సంబందించి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వ‌లేదు. ఇవాళ దర్శకుడు తేజ పుట్టినరోజు కావడంతో .. ఈ సినిమా టైటిల్ తో పాటు Abhiram Daggubati ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ సినిమా టైటిల్ ‘అహింస’ అయితే అందుకు పూర్తి భిన్నంగా హింసకి గురైన హీరో ప్రీ లుక్ ను రిలీజ్ చేసి త‌న మార్క్ చూపించారు తేజ. లవ్… యాక్షన్.. ఎమోషన్ ను మిక్స్ చేసి తేజ ఈ సినిమాను రూపొందిస్తున్నాడ‌ట‌. ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాతో సంగీత ద‌ర్శ‌కుడిగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. చాలా కాలంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా జ‌రుగుతూనే ఉన్నాయి. అభిరామ్ శ్రీ‌రెడ్డి వివాదంతో పాపుల‌ర్ అయిన విష‌యం తెలిసిందే..ఈ సినిమా కోసం విదేశాల్లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నాడు అభిరామ్‌. ప్ర‌ముఖ నిర్మాత సురేష్ బాబు త‌న కొడుకు Abhiram Daggubati ని వేరే బ్యాన‌ర్‌తో హిరోగా ప‌రిచ‌యం చేపిస్తుండ‌డం విశేషం.

ReadMore: #NBK107: కాపీనా? రీమేకా? 

ట్రెండింగ్ వార్తలు