ఆచార్యను టెన్షన్‌ పెడుతున్న అఖండ

December 19, 2021

ఆచార్యను టెన్షన్‌ పెడుతున్న అఖండ

బాలకృష్ణ హీరోగా చేసిన అఖండ అద్భుతమైన విజయం సాధించింది. ఒకరకంగా చెప్పాలంటే సెకండ్‌ లాక్‌డౌన్‌ తర్వాత ప్రేక్షకులను థియేటర్స్‌కు పరుగులు పెట్టించింది అఖండ సినిమాయే. దీంతో చిరంజీవి తన లేటెస్ట్‌ ఫిల్మ్‌ ‘ఆచార్య’లో ఎలివేషన్‌ షాట్స్‌ కావాలని ఈ చిత్రం దర్శకుడు కొరటాల శివపై ఒత్తిడి తెస్తున్నాడు. క్లాస్‌ ఆడియన్స్‌ను మెప్పించే మాస్‌ పల్స్‌మాత్రమే తెలిసిన కొరటాల శివ ఇప్పుడు స్క్రిప్ట్‌లో కొత్త సీన్స్‌ను చేరుస్తున్నారట. ఇందులో కోసం దాదాపు నెల రోజుల పాటు రీ షూట్‌ చేయాలని కూడా డిసైడ్‌ అయ్యారట కొరటాల అండ్‌ కో. దీనిబట్టి ఫిబ్రవరి 04న విడుదల కావాల్సిన ఆచార్య చిత్రం వేసవికి వాయిదా పడుతుందని ఊహించుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు