మీ అరిగిపోయిన చెప్పులు ఇస్తే ముద్దు పెట్టుకుంటా.. బ్రహ్మాజీ సంచలన వ్యాఖ్యలు?

July 3, 2024

మీ అరిగిపోయిన చెప్పులు ఇస్తే ముద్దు పెట్టుకుంటా.. బ్రహ్మాజీ సంచలన వ్యాఖ్యలు?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ఇటీవల కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయం అందుకోవడంతో ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నటుడు బ్రహ్మజీ సైతం కల్కి సినిమా చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా కోసం తన చెప్పులు అరిగేలా తిరిగానని నాగ్ అశ్విన్ ఈ సినిమా విడుదల రోజు ఆసక్తికరమైన పోస్ట్ చేయడమే కాకుండా తన అరిగిపోయిన చెప్పులకు సంబంధించిన ఫోటోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే కల్కి సినిమా చూసిన తర్వాత నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించి స్పందిస్తూ..తెలుగు సినిమా అనుకుంటే వరల్డ్ సినిమా తీశారు.. నాగ్ అశ్విన్ గారు మీ అరిగిపోయిన చెప్పులు ఇస్తే ముద్దు పెట్టుకొంటాను. థాంక్యూ ప్రియాంక దత్, స్వప్న దత్ మీ రిస్కులే మీకు శ్రీరామరక్ష అంటూ ఈ సందర్భంగా బ్రహ్మాజీ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

ఇక బ్రహ్మాజీ సైతం ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన కమెడియన్ గాను అలాగే విలన్ పాత్రలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే బ్రహ్మాజీ ఇక్కడ కూడా ఎంతో ఫన్నీ పోస్టులను చేస్తూ అభిమానులను సందడి చేస్తూ ఉంటారు

Related News

ట్రెండింగ్ వార్తలు