May 30, 2024
సాధారణంగా మనం ఎవరి కాళ్ళకైనా నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నాము అంటే వాళ్ళు మనకంటే వయసులో పెద్దవాళ్ళు అయితేనే కాళ్లకు నమస్కరిస్తాము కానీ చిన్న వాళ్లకు కూడా కొన్ని సందర్భాలలో నమస్కరిస్తుంటాము అది వాళ్ళు ఏదైనా దేవుడి మాల వేసుకున్నప్పుడు వంటి సందర్భాలలో మాత్రమే మనకంటే చిన్న వాళ్లకు కూడా నమస్కరిస్తూ ఉంటాయి. అయితే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరో అయినటువంటి కార్తికేయ మరొక యంగ్ హీరో అయినటువంటి శర్వానంద్ పాదాలకు నమస్కారం చేశారు.
ఈ విధంగా కార్తికేయ శర్వానంద్ కాళ్లకు నమస్కారం చేయడంతో అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు కార్తికేయ శర్వానంద్ కాళ్లకు ఎందుకు నమస్కరించారనే విషయానికి వస్తే.. కార్తికేయ ఇటీవల బెదరు లంక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఇక త్వరలోనే భజే వాయువేగం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా మే 31వ తేదీ రాబోతున్న నేపథ్యంలో ఇటీవల ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శర్వానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే శర్వానంద్ ప్రస్తుతం అయ్యప్ప మాల వేసుకుని ఉన్నారు. ఇలా మాల వేసుకున్నప్పటికీ కార్తికేయ ఆహ్వానం మేరకు ఈ సినిమా వేడుకకు వచ్చారు. ఇక ఈ వేడుకకు శర్వానంద్ రాగానే ఆయన కాళ్ళకు నమస్కరించారు కార్తికేయ.
అలాగే వేదికపై శర్వానంద్ మాట్లాడుతూ ఉండగా పైకి వెళ్లినటువంటి కార్తికేయ శర్వానంద్ పాదాలకు నమస్కారం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో కార్తికేయకు భక్తి భావం ఎక్కువగా ఉందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
Read More: బాలయ్య పై ట్రోల్స్ ఆపండి.. బాలయ్య అంజలి ఘటనపై విశ్వక్ కామెంట్స్!