May 23, 2024
తాజాగా బుల్లితెర జంట నటుడు చందు నటి పవిత్రలు మరణించిన విషయం తెలిసిందే. వీరి మరణం అందరిని ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. సీరియల్స్ లో నటిస్తూ దగ్గరైనా వీరు త్వరలోనే భార్యాభర్తలు గా పరిచయం చేసుకుందామని అనుకున్నారు. కానీ తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలచినట్టు వారి ఆశలు ఆవిరి అయ్యాయి. రోడ్డు ప్రమాదంలో పవిత్ర మరణించగా తర్వాత ఐదు రోజులకే చందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికీ వీరికి సంబంధించిన ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ విషాద ఘటనపై పలువురు ప్రముఖులు స్పందించగా తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటుడు నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉమ్మడి కుటుంబంలో ఒకరు కిందపడితే పదిమంది వచ్చి పైకి లేపేవాళ్లు. మేమున్నామంటూ సపోర్ట్ చేసేవాళ్లు. మా ఇంట్లో కూడా అలాగే ఉండేది. ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీకి వచ్చేశాము. అమ్మానాన్న పిల్లలు.. ఇదే కుటుంబం.. ఇక్కడ ఎవరి జీవితం వాళ్లది, ఎవరి ఆశయాలు వాళ్లవి.. ఒక స్టేజ్ దాటాక ఎవరూ ఎవరికి సపోర్ట్ చేయరు. పెద్దల మాటను పిల్లలు లెక్కచేయడం లేదు. అలాగే సంపాదన మొదలయ్యాక తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు.
అసలేం కోల్పోతున్నారనేది వాళ్లకు అర్థం కావడం లేదు. ప్రియురాలు లేదా భార్య ఉన్నా సరే ఒంటరి అయిపోతున్నారు. ఆత్మ స్థైర్యాన్ని కోల్పోతున్నారు. మానసికంగా బలహీనమైపోతున్నారు. నా విషయమే తీసుకుంటే అమ్మ చనిపోయాక కృష్ణగారు, నేను ఎంతగానో బాధపడ్డాము మేము ఒకరినొకరం ఓదార్చుకునేవాళ్లం అని చెప్పు కొచ్చారు నరేష్.
Read More: ఓటీటీ లో భారీ రేట్ పలికిన అజిత్ మూవీ.. ద గోట్ మూవీ ని వెనక్కి నెట్టిన గుడ్ బాడ్ అగ్లీ!