సేవా కార్యక్రమాలలో నటుడు లారెన్స్… ఆ గుండె బ్రతకాలంటూ కామెంట్స్!

May 20, 2024

సేవా కార్యక్రమాలలో నటుడు లారెన్స్… ఆ గుండె బ్రతకాలంటూ కామెంట్స్!

సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు లారెన్స్ ఒకరు. అయితే ఈయన కొరియోగ్రాఫర్ గా తన ప్రయాణం మొదలుపెట్టి అనంతరం నటుడిగా దర్శకుడిగా కూడా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఇక ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అందుకొని ఇండస్ట్రీలో సంపాదించినది మొత్తం ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది అనాధ పిల్లలను చేరదీసి వారికి ఉన్నత చదువులు చదివించడమే కాకుండా ఎంతో మందికి వివిధ రకాల సహాయ సహకారాలను చేశారు ఇటీవల రైతుల కోసం ట్రాక్టర్లను కూడా ఉచితంగా పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విధంగా లారెన్స్ ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయపడుతూ ఉన్నారు. అయితే తాజాగా ఈయన మరోసారి సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు వీడియోలు షేర్ చేశారు.

ఇందులో భాగంగా లారెన్స్ గత 20 సంవత్సరాల క్రితం కొంతమంది పిల్లలను దత్తత తీసుకొని వారి చదువులు ఇతర బాధ్యతలన్నీ కూడా ఆయనే చూసుకున్నారు. ఇలా 20 సంవత్సరాల తర్వాత తిరిగి మరోసారి ఆ పిల్లలతో కలిసి ఈయన ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి ఫోటోలను వీడియోలను షేర్ చేశారు. పిల్లలందరితో కలిసి ఆడుతూ పాడుతూ డాన్సులు వేస్తూ కనిపించారు.

ఈ విధంగా లారెన్స్ చేస్తున్నటువంటి మంచి పనులకు ఇలాంటివి ఎన్నో నిదర్శనంగా నిలిచాయి. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది లారెన్స్ మంచి మనసు పై ప్రశంసల కురిపిస్తున్నారు మీలాంటి మంచి గుండె పదికాలాలపాటు బ్రతకాలి ఎంతోమందికి మీరు జీవితం కల్పించాలి అంటూ ఈ వీడియోలపై కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈయన ఏ విధమైనటువంటి విరాళాలు లేకుండా తన సొంత డబ్బులతోనే ట్రస్ట్ నడిపిస్తూ ఇలా సహాయ సహకారాలు చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

Read More: హ్యాపీ బర్త్ డే బావ.. ఫియర్ ఫైర్ అంటూ ఎన్టీఆర్ కు స్పెషల్ విషెస్ చెప్పిన బన్నీ!

Related News

ట్రెండింగ్ వార్తలు