నటి పూర్ణతో రవిబాబు ఎఫైర్.. అసలు విషయం బయటపెట్టిన నటుడు?

June 6, 2024

నటి పూర్ణతో రవిబాబు ఎఫైర్.. అసలు విషయం బయటపెట్టిన నటుడు?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి పూర్ణ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు. ఈమె తెలుగులో హీరోయిన్గా పలు సినిమాలలో నటించారు. అయితే ఇటీవల హీరోయిన్ గా కాకుండా సినిమాలలో పలు కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

ఇటీవల మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత పెట్టే పాటలో నటించి సందడి చేశారు. ఇక ఈమె లడ్డు బాబు, అవును, అవును 2 వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు. అయితే ఈ సినిమాలన్నీ కూడా రవిబాబు డైరెక్షన్లో రావడం విశేషం. ఇక రవిబాబు ఎన్నో విభిన్న కథ సినిమాలలో నటించడమే కాకుండా విభిన్న కథా చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా వీరిద్దరి కాంబినేషన్లో వరుసగా సినిమాలు రావడంతో వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. రవి బాబు పూర్ణతో ఎఫైర్ పెట్టుకున్నారని అందుకే సినిమాలన్నీ కూడా తనతోనే చేస్తున్నారంటూ భారీ స్థాయిలో వార్తలు నడిచాయి. ఇక ఇటీవల పూర్ణ పెళ్లి చేసుకున్నప్పటికీ అడపాదడప ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇలా పూర్ణతో ఎఫైర్ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవిబాబు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా పూర్ణతో ఎఫైర్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు రవిబాబు సమాధానం చెబుతూ మీడియాలో పూర్ణ గురించి వచ్చినటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని కొట్టి పారేశారు. నేను ఎంచుకున్నటువంటి కథలకు పూర్ణ పర్ఫెక్ట్ గా సరిపోవటం వల్ల నేను ఆమెకు సినిమా అవకాశాలు కల్పించాను. ఇలా మా ఇద్దరి నుంచి వరుసగా సినిమాలు రావటం వల్లే చాలామంది ఈ రూమర్లను క్రియేట్ చేశారే తప్ప మా మధ్య ఏ విధమైనటువంటి ఎఫైర్స్ లేవని ఎలాంటి రిలేషన్ లేదంటూ కుండలు బద్దలు కొట్టినట్టు క్లారిటీ ఇచ్చారు.

Read More: పిఠాపురం ఎమ్మెల్యే గారు అంటూ పవన్ పై ఆసక్తికర పోస్ట్ చేసిన వెంకీ..ట్వీట్ వైరల్!

Related News

ట్రెండింగ్ వార్తలు