రేవ్ పార్టీలు పబ్ లకు వెళ్లే వ్యక్తి కాదు నేను.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్!

May 20, 2024

రేవ్ పార్టీలు పబ్ లకు వెళ్లే వ్యక్తి కాదు నేను.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్!

బెంగళూరు రేవ్ పార్టీలో భాగంగా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు అరెస్ట్ అయినట్లు మీడియా వార్తలలోనూ అలాగే సోషల్ మీడియా వార్తలలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే అయితే ఇందులో భాగంగా కొన్ని వీడియో క్లిప్స్ వైరల్ అవుతున్నటువంటి తరుణంలో సినీ నటుడు శ్రీకాంత్ కూడా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, ఆయనని కూడా పోలీసులు అరెస్టు చేశారు అంటూ వార్తలు వచ్చాయి.

ఇలా శ్రీకాంత్ పోలీసులకు పట్టుపడ్డారు అంటూ వార్తలు రావడంతో వెంటనే శ్రీకాంత స్పందించి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. అయితే స్వయంగా ఆయన తన ఇంట్లో ఉన్నటువంటి ఒక వీడియోని షేర్ చేస్తూ నేను బెంగుళూరు రేవు పార్టీకి వెళ్లలేదని ప్రస్తుతం నా ఇంట్లోనే ఉన్నానని తెలిపారు అయితే చాలామంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీగా ఈ విషయం కనుక్కున్నారని కానీ నేను అక్కడ అరెస్టయ్యాను అనే విషయం పూర్తిగా ఆవాస్తవమని తెలిపారు.

కొన్ని వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అందులో ఒక వ్యక్తి నా పోలికలతోనే ఉన్నారు కొంచెం గడ్డం ఉండడమే కాకుండా మొహం కవర్ చేస్తూ ఉండడంతో నేను కూడా ఆ వీడియో క్లిప్ చూసి షాక్ అయ్యాను కానీ ఎవరు కూడా అది నేనేనని నమ్మద్దని నేను నా ఇంట్లోనే ఉన్నానని తెలిపారు. ఈ వార్తలను చూసి మా ఇంట్లో మేమంతా నవ్వుకున్నామని మొన్నేమో నా భార్యతో నాకు విడాకులు ఇప్పించారు ఇప్పుడేమో రేవ్ పార్టీకి వెళ్లి అరెస్టు చేయించారు అంటూ శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు.

ఇకపోతే నేను ఎప్పుడూ కూడా రేవ్ పార్టీలకు వెళ్లలేదని అలాంటి పార్టీలన్న పబ్ అన్న కూడా నేను చాలా దూరంగా ఉంటానని ఈ సందర్భంగా శ్రీకాంత్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఎక్కడైనా బర్త్డే పార్టీకి వెళ్తే కాసేపు అక్కడ ఉండి తిరిగి వచ్చేస్తానని ఈయన ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.

Read More: ఆ విషయంలో టాలీవుడ్ మారాలి.. కాజల్ కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు