పవన్ ముగ్గురిని కాకపోతే 30 మందిని చేసుకుంటారు మీకెందుకు: నటుడు సుమన్

June 21, 2024

పవన్ ముగ్గురిని కాకపోతే 30 మందిని చేసుకుంటారు మీకెందుకు: నటుడు సుమన్

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు సుమన్ ఒకరు. ఈయన ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవితో పోటీగా సినిమాలలో నటించేవారు అయితే కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఈయన కెరియర్ లో వెనుకబడ్డారు ఇలా సినీ ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటున్న ఈయన అప్పుడప్పుడు పలు కార్యక్రమాలలో పాల్గొంటూ సినీ రాజకీయాల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు.

ఈ క్రమంలోనే ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుమన్ రాజకీయాల గురించి అలాగే సినీ సెలబ్రిటీల జీవితాల గురించి మాట్లాడారు. సినిమా రంగానికి చెందిన ఎంతో మంది ప్రస్తుత రాజకీయాలలో ఉన్నత స్థాయిలో ఉన్నారు వారందరిని చూస్తే చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇకపోతే ఇటీవల రాజకీయాలు ఎలా ఉన్నాయి అంటే ప్రజల సంక్షేమం మరిచి వ్యక్తిగత విమర్శలకే సమయం కేటాయిస్తున్నారని వెల్లడించారు.

ముఖ్యంగా సినీ నటుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వెళ్లిన తర్వాత ఆయనని రాజకీయంగా కాకుండా చాలామంది వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారంట తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మీకేంటి 30 చేసుకుంటే మీకేంటి వారు ఏమైనా వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చారా లేకపోతే సాయం అడిగారా అంటూ మండి పడ్డారు.

ఇక సినీనటి రోజా గురించి కూడా ఈయన మాట్లాడారు ఆమె హీరోయిన్గా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు. ఒక అమ్మాయి ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగాలి అంటే ఎన్నో కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. అలాంటి హీరోయిన్ పట్ల చాలామంది కాంట్రవర్సీయల్ గా మాట్లాడుతూ ఇబ్బంది పెట్టారు.. ఇలా రోజా గురించి విమర్శలు చేయడం బాధ కలిగించింది అంటూ ఈయన సినిమా సెలబ్రిటీలు రాజకీయంగా ఎదుర్కొంటున్నటువంటి విమర్శల గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: ఆ కారణంతోనే నేను మూడో బిడ్డను కనలేదు.. యాంకర్ సుమ కామెంట్స్ వైరల్!

Related News

ట్రెండింగ్ వార్తలు