తరుణ్ కారణంగా బన్నీకి ఆర్య సినిమా ఛాన్స్ వచ్చిందా.. ఎలానో తెలుసా?

May 15, 2024

తరుణ్ కారణంగా బన్నీకి ఆర్య సినిమా ఛాన్స్ వచ్చిందా.. ఎలానో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించినటువంటి చిత్రాలలో ఆర్య సినిమా ఒకటి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఇక ఈ సినిమా విడుదల అయ్యి 20 సంవత్సరాలు పూర్తి కావడంతో ఇటీవల చిత్ర బృందం గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసి ఆర్య జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వడమే కాకుండా ఈ సినిమా తర్వాత ఈయన హీరోగా వెనతిరిగి చూసుకోలేదని చెప్పాలి. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు. ఇకపోతే తాజాగా ఆర్య సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. అల్లు అర్జున్ ఆర్య సినిమా ఒక స్టార్ హీరో కారణంగానే అవకాశం వచ్చిందని తెలుస్తుంది.

గంగోత్రి సినిమా తర్వాత అల్లు అర్జున్ కు సినిమా అవకాశాలు వస్తున్న ఏ సినిమా కూడా తనకు నచ్చలేదట దీంతో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు అలాంటి తరుణంలోనే నితిన్ హీరోగా నటించిన దిల్ సినిమా విడుదలకు ముందు ఫ్రీ రిలీజ్ షో వేయడంతో హీరో తరుణ్ తనకి ఫోన్ చేసి సినిమా చూడటానికి వెళ్దామని పిలిచారట.

అలా ఇద్దరు ఈ సినిమా చూడటానికి వెళ్తే అక్కడ సుకుమార్ గారు అల్లు అర్జున్ కలిసి తన ఆర్య సినిమా స్టోరీ లైన్ వినిపించారట. స్టోరీ లైన్ విన్నటువంటి బన్నీకి సినిమా కథ నచ్చడంతో తిరిగి ఈ సినిమా కథ మొత్తం విన్నారని ప్రతి ఒక్క సీన్ కూడా ఎక్సైట్ గా అనిపించడంతో ఈ సినిమాకు కమిట్ అయ్యారు అంటూ అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ హిట్ సినిమా రావడం వెనుక పరోక్షంగా తరుణ్ హస్తం ఉందని తెలుస్తోంది.

Read More: డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఉపాసన.. నా కూతురి కంటే నేను ఎక్కువగా ఏడుస్తాను?

ట్రెండింగ్ వార్తలు