April 3, 2024
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా పని సినిమాలలో నటించినటువంటి నరేష్ అనంతరం కమెడియన్ గా ప్రస్తుతం సపోర్ట్ క్యారెక్టర్లలో నటిస్తూ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీ అయ్యారు. ఇండస్ట్రీలో నటిస్తూ సంపాదించుకున్న క్రేజ్ కంటే ఈయన ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలవడం లేదంటే తన వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలవడం ద్వారా ఫేమస్ అయ్యారు. ఈయన ముఖ్యంగా తన పెళ్లి విషయంలో వివాదాలలో నిలిచారు.
ముగ్గురిని పెళ్లి చేసుకొని ముగ్గురికి విడాకులు ఇవ్వడమే కాకుండా తిరిగి నటి పవిత్ర లోకేష్ తో ఈయన రిలేషన్ లో ఉండటంతో ఈ వ్యవహారం కాస్త వివాదంగా మారింది.. ఇలా తరచూ ఏదో ఒక వివాదం ద్వారా వార్తలలో నిలిచే నరేష్ తాజాగా ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనగా మారాయి.
ఈ సందర్భంగా ఈయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఏపీలో అధికార మార్పిడి జరుగుతుందని అంతకుముందే రక్తపాతం జరుగుతుందని భావిస్తున్నాను అంటూ చేసినటువంటి ట్వీట్ సంచలనంగా మారింది. అయితే ఈయన ఏ పార్టీని ఉద్దేశించి చేశారు అనేది స్పష్టంగా తెలియకపోయినా అధికారం మారుతుందని రక్తపాతం జరుగుతుంది అంటూ కామెంట్లు చేయడంతో వైసిపిని టార్గెట్ చేస్తూనే ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అర్థమవుతుంది.
ఇలా ఏపీ రాజకీయాల పట్ల ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా సినిమా సెలబ్రిటీలు కూడా ఆంధ్ర రాజకీయాలపై చాలా ఆసక్తి కనపరుస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈయన ఈ విధమైనటువంటి ట్వీట్ చేయటంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. మరి ఈ విషయం ఎలాంటి వివాదాలకు కారణమవుతుందో తెలియదు కానీ తాను వివాదాలలో లేకపోతే ప్రజలు నన్ను మర్చిపోతారేమోనని భావించి నరేష్ ఇలా వివాదాస్పద ట్వీట్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.
Read More: పొద్దున లేవగానే ఆమె ఫోటోనే చూస్తాను.. మహానటి గురించి చిరంజీవి వ్యాఖ్యలు!