చిరంజీవిని తలుచుకొని ఎన్నోసార్లు ఏడ్చాను.. ఆమని కామెంట్స్ వైరల్!

June 21, 2024

చిరంజీవిని తలుచుకొని ఎన్నోసార్లు ఏడ్చాను.. ఆమని కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు సీనియర్ నటి ఆమని శుభలగ్నం, మిస్టర్ పెళ్ళాం, మావిచిగురు, జంబలకడిపంబ వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ సీనియర్ హీరోయిన్గా కొనసాగిన ఈమె ఇండస్ట్రీలో ఉన్నటువంటి అగ్ర హీరోలు అందరి సరసన నటించారు.

ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే పెళ్లి చేసుకుని కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైన ఆమని ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలోను వెబ్ సిరీస్ లలోను నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఆమని మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నేను ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించాను కానీ ఇప్పటివరకు నాకు చిరంజీవి గారి పక్కన నటించే అవకాశం రాలేదని తెలిపారు. చిరంజీవితో నటించాలని కోరిక నాకు చాలా ఉండేది కానీ ఎప్పుడూ అవకాశం రాలేదు. నేను ఏదైనా డ్రీమ్ సాంగ్ ఊహించుకుంటే అందులో తప్పనిసరిగా చిరంజీవి గారిని ఊహించుకొనే దానిననీ తెలిపారు.

ఇక చిరంజీవి నటించిన రిక్షావోడు సినిమాలో నాకు నటించే అవకాశం వచ్చింది సినిమా డేట్స్ కూడా ఫిక్స్ అయ్యి షూటింగ్ కి వెళ్తున్నాము కానీ అంతలోపే ఈ సినిమాలో నగ్మా హీరోయిన్ అంటూ ఒక న్యూస్ పేపర్లో చదివాను అసలు ఏం జరిగిందో కనుక్కోమని చెప్పగా డైరెక్టర్ మారడం వల్లే హీరోయిన్ కూడా మారారని తెలిసి చాలా బాధపడ్డాను ఇక చిరంజీవికి చెల్లెలుగా నటించమని ఆఫర్స్ వచ్చిన నేను నటించలేదని తెలిపారు. ఇలా చిరంజీవితో ఎన్నోసార్లు నటించాలనుకున్న నేను నటించలేకపోయాననే విషయం గుర్తొచ్చినప్పుడల్లా బాగా ఏడ్చేదానిని అంటూ ఈ సందర్భంగా చిరంజీవి గురించి ఆయనతో నటించడం గురించి ఆమని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: మమ్మల్ని ఇడ్లీ సాంబార్ అని పిలిస్తే ఊరుకోము.. నోరు మూసుకొని వెళ్ళండి: శృతిహాసన్

ట్రెండింగ్ వార్తలు