April 4, 2024
హీరోయిన్ ఆర్తి చాబ్రియా అంటే చాలామందికి టక్కున గుర్తుకు రాకపోవచ్చు కానీ ఒకరికి ఒకరు సినిమాలో హీరోయిన్ సుబ్బలక్ష్మి అంటే ఇట్టే గుర్తుకు వస్తుంది. రసూల్ ఎల్లోర్ డైరెక్షన్లో వచ్చిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఒకరికి ఒకరు సినిమా. ఈ సినిమాలో “ఎక్కడున్నావమ్మా” “నువ్వే నాశ్వాస” పాటలు ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్ సాంగ్స్. ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ మొదట మోడల్ గా కెరియర్ ప్రారంభించి మధుర క్షణం అనే తెలుగు సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
తర్వాత కొన్ని బాలీవుడ్ సినిమాలు చేసి మళ్లీ టాలీవుడ్ కి వచ్చి ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి, చింతకాయల రవి, గోడమీద పిల్లి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఈమె హిందీలో కూడా ఆవారా పాగల్ దీవానా, రాజా భయ్యా, షాదీ నెంబర్ వన్, హే బేబీ వంటి సినిమాలలో నటించింది. 2013 లో విడుదలైన పంజాబీ చిత్రం వ్యాహ్ 70 కి మీలో కనిపించింది.ఆ తర్వాత ఆమె సినిమాలకి దూరమైంది.
అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆర్తి ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ తన అభిమానులకి దగ్గరగానే ఉంటూ వచ్చింది. అయితే ఈమె కేవలం యాక్టర్ మాత్రమే కాదు ఒక మంచి మోటివేషనల్ స్పీకర్ కూడా. ప్రస్తుతం ఈమె విక్టోరియస్ మైండ్ పవర్ అనే ఆన్లైన్ కోచింగ్ ప్లాట్ఫారం కు ఫౌండర్ గా వ్యవహరిస్తోంది.
2019లో ఆస్ట్రేలియాకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ విశారద్ బీదాస్సీ ని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈమె ప్రెగ్నెంట్. త్వరలోనే ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్న ఆర్తి బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆమెకు బెస్ట్ విషెస్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆమె అభిమానులు.
Read More: ఫ్యామిలీ స్టార్ మూవీ కి దిల్ రాజు భార్య రివ్యూ.. గెస్ట్ రోల్ చేస్తున్న స్టార్ హీరోయిన్!