నాకు ఐదో పెళ్లి చేయాలని చూస్తున్నారు.. తన పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి అంజలి!

April 4, 2024

నాకు ఐదో పెళ్లి చేయాలని చూస్తున్నారు.. తన పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి అంజలి!

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన అంజలికి ఆ తర్వాత గీతాంజలి అంత మంచి హిట్ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో ఆమెకి పెద్దగా హిట్ రాలేదనే చెప్పాలి. అయితే చాలా సంవత్సరాల తరువాత మళ్లీ గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాతో గీతాంజలి సినిమాకి సీక్వెల్ తో మన ముందుకి వస్తుంది అంజలి.

ఏప్రిల్ 11న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సభలో అంజలి సినిమా గురించి మాట్లాడుతూ తన పెళ్లిపై వస్తున్న రూమర్స్ గురించి కూడా మాట్లాడారు. నేను చేయగలిగిన పాత్రల అవకాశాలు నాకు ఎప్పుడూ వస్తూనే ఉన్నాయి. అలా వచ్చాయి కాబట్టే ఈ స్థాయిలో ఉన్నాను.

ఈ సినిమా తరువాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గేమ్ చేంజర్ సినిమాతో పాటు నవీన్ పోలిశెట్టితో ఒక చిత్రం చేస్తున్నాను. 50వ సినిమా చేస్తున్నప్పుడే మరొక ఆరు సినిమాలు లైనప్ లో ఉన్నాయి. ఇక నేను హీరోయిన్ గా చేసిన మొదటి సినిమా గీతాంజలి నాకు చాలా ప్రత్యేకం ఇప్పుడు మళ్ళీ అదే సినిమాకి సీక్వెల్ తో మీ ముందుకి వస్తున్నాను అని చెప్పింది.

ఆపై తన పెళ్లి గురించి మాట్లాడుతూ నాకు తెలియకుండానే ఇప్పటికే నాలుగు సార్లు పెళ్లిళ్లు చేసేసారు. ఇప్పుడు ఐదోసారి చేస్తున్నారు. ఇంకా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటంటే నేను పెళ్లి చేసుకొని వేరే ఇంట్లో ఉంటున్నట్లు రాశారు. వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే నేను అవుట్ డోర్ షూటింగ్స్ లోనే ఎక్కువగా ఉంటున్నాను. ఆ వార్తకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇది ఫేక్ న్యూస్. పెళ్లి చేసుకుంటాను కానీ ఇప్పట్లో కాదు అంటూ తన పెళ్లి పై వస్తున్న రూమర్లకి స్ట్రాంగ్ చెక్ పెట్టింది అంజలి.

Read More: ఈ సినిమాకి డైలాగ్ రైటర్ గా త్రివిక్రమ్.. కరెక్ట్ పర్సన్ అంటున్న నెటిజన్స్!

ట్రెండింగ్ వార్తలు