బాలయ్య బాబు ప్రవర్తన వీడియోపై స్పందించిన అంజలి.. వీడియో వైరల్?

May 31, 2024

బాలయ్య బాబు ప్రవర్తన వీడియోపై స్పందించిన అంజలి.. వీడియో వైరల్?

విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలయ్య బాబు ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. అయితే ఈవెంట్ లో బాలయ్య బాబు హీరోయిన్ అంజలితో ప్రవర్తించిన తీరుపై నెటిజన్స్ విమర్శలు గుప్పించడంతో పాటు ఆ వీడియోనీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ దారుణంగా ట్రోల్స్ చేశారు. అదే విషయం గురించి ఎక్కడ చూసినా కూడా చర్చించుకున్నారు. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

బాలకృష్ణ తో పాటు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీమ్ మొత్తం స్టేజ్ మీద ఉన్న సమయంలో తన పక్కనే ఉన్న హీరోయిన్ అంజలిని కొంచెం పక్కకి జరగమని బాలయ్య చెప్పారు. ఆమె కొంచెమే జరగడంతో ఏమైందో ఏమో కానీ ఒకేసారి అంజలిని పక్కకి నెట్టేశారు బాలయ్య. ఈ సడెన్ షాక్‌కి అంజలి కాస్త వెనక్కి తూలింది. అంజలి కాస్త తడబడినా బాలయ్య చర్యను స్పోర్టివ్ గా తీసుకుంది. నవ్వుతూనే ఫొటోలకు పోజులిచ్చింది. ఆమె పక్కన నిలబడిన నేహాశెట్టి మాత్రం కాస్త అవాక్కయినట్లుగా కనిపించింది. ఆ సమయంలో బాలకృష్ణ ఆమెతో ఏం మాట్లాడారో తెలియనప్పటికీ అంజలి మాత్రం నవ్వుతూనే ప్రతి స్పందించింది.

ఈ వీడియో పై దారుణంగా విమర్శలు రావడంతో తాజాగా ఈ వీడియో పై హీరోయిన్ అంజలి స్పందించింది. మేము ఇద్దరు ఎపుడు ఎంతో స్నేహంగానే ఉంటాము. మేమిద్దరం కూడా ఎప్పుడూ ఒకరి పట్ల మరొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకునే వాళ్ళం అని చెబుతూ ఈవెంట్ లో వారి మధ్య కొన్ని మూమెంట్స్ ని వీడియో రూపంగా పెట్టింది. ఇందులో బాలయ్య ఆమెతో నవ్వుతూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అలాగే ఆమెని తోసిన క్లిప్ కూడా ఉంది. మొత్తానికి బాలయ్య విషయంలో అంజలినే ఎలాంటి సమస్య లేదని చెప్పి ట్రోలింగ్స్ కీ నెగిటివ్ కామెంట్స్ కి చెక్ పెట్టింది.

Read More: ప్రభాస్ కల్కి ట్రైలర్ అప్పుడు విడుదల కానుందా.. ఇందులో నిజమెంత?

ట్రెండింగ్ వార్తలు