బెంగళూరు రేవ్ పార్టీకి నాకు సంబంధం లేదు.. నటి హేమ క్లారిటీ?

May 20, 2024

బెంగళూరు రేవ్ పార్టీకి నాకు సంబంధం లేదు.. నటి హేమ క్లారిటీ?

బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు ఈ ఫామ్ హౌస్ పై దాడి చేశారు. ఓ ప్రముఖ వ్యాపారవేత్త పుట్టినరోజు సందర్భంగా ఫామ్ హౌస్ వేడుకలు జరిగాయి. అయితే ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు మోడల్స్ కూడా హాజరయ్యాలని తెలుస్తుంది. అర్ధరాత్రి జరిగిన ఈ హౌస్ లో పెద్ద ఎత్తున వేడుకలు జరగడమే కాకుండా భారీ స్థాయిలో డ్రగ్స్ వినియోగిస్తున్నారు అంటూ పోలీసులకు సమాచారం వచ్చింది.

ఇలా పోలీసులకు సమాచారం అందిన వెంటనే పోలీసులు ఈ ఫామ్ హౌస్ పై అరెస్టు చేశారు అయితే ఈ పార్టీలో సుమారు 100 మంది వరకు ఉన్నట్టు సమాచారం. ఈ వంద మందిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ పార్టీలో ఏకంగా 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్‌, కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫామ్‌ హౌస్ పరిసరాల్లో జాగ్వార్‌, బెంజ్‌ సహా పలు ఖరీదైన కార్లను కూడా సీజ్ చేశారు.

ఇకపోతే ఈ పార్టీలో పట్టుబడినటువంటి వారిలో టాలీవుడ్ నటి హేమ కూడా ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలపై ఆమె స్పందించారు. నాకు బెంగళూరులో జరిగినటువంటి పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని తెలిపారు. ప్రస్తుతం నేను హైదరాబాదులో నా ఫామ్ హౌస్ లో చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. నా గురించి సోషల్ మీడియాలోనూ అలాగే మీడియా వార్తలలో వచ్చేదంతా అబద్ధం ఎవరు నమ్మకండి అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈమె షేర్ చేసినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read More: సేవా కార్యక్రమాలలో నటుడు లారెన్స్… ఆ గుండె బ్రతకాలంటూ కామెంట్స్!

ట్రెండింగ్ వార్తలు