డ్రగ్స్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చింది…మా సభ్యత్వాన్ని కొనసాగించండి: హేమ

July 8, 2024

డ్రగ్స్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చింది…మా సభ్యత్వాన్ని కొనసాగించండి: హేమ

సినీ నటి హేమ ఇటీవల పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే. బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో భాగంగా ఈమె పాల్గొన్నారని, అంతేకాకుండా ఈమె డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా డ్రగ్స్ టెస్ట్ రిపోర్ట్ లో భాగంగా ఈమెకు పాజిటివ్ రావడంతో విచారణకు హాజరు కావాలని బెంగళూరు పోలీసులు ఈమెకు నోటీసులు పంపించారు.

ఇలా నోటీసులు పంపిన విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు ఈమెను అరెస్టు చేసే రిమాండ్ కి పంపించారు. ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చిన హేమ ఇటీవల మా అధ్యక్షుడు మంచు విష్ణుని కలిశారు. ఈమె డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించడంతో మా సభ్యత్వం నుంచి ఈమెను తొలగిస్తూ సస్పెన్షన్ వేటు వేశారు. అయితే తిరిగి తన మా సభ్యత్వం కొనసాగించాలంటూ ఈమె మంచు విష్ణుని కోరారు.

ఈమె డ్రగ్స్ కేసులో చిక్కుకోవడంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈమె ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఈ సందర్భంగా మా అధ్యక్షుడిని కలిసిన ఈమె తనకు ఎలాంటి షోకాజు నోటీసులు ఇవ్వకుండా మా సభ్యత్వం నుంచి తొలగించడం చాలా అన్యాయమని తెలియజేస్తూ మంచు విష్ణుకి ఒక లేఖ అందజేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని తాను నిర్దోషినని ఈమె వెల్లడించారు.

ఇకపోతే నేను డ్రగ్స్ తీసుకున్నట్లు వచ్చిన వార్తలు పూర్తిగా ఆవాస్తవమని అలాగే డ్రగ్స్ టెస్టులో భాగంగా తనకు నెగిటివ్ వచ్చిందని ఈమె తెలియజేసారు. ఈ క్రమంలోనే తిరిగి తనకు మా సభ్యత్వం కల్పించాలని మా అధ్యక్షుడు మంచు విష్ణును కోరుతూ ఈమె లెటర్ అందించారు. మరి ఈమె సభ్యత్వం పై మా అసోసియేషన్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది తెలియాల్సి ఉంది

Related News

ట్రెండింగ్ వార్తలు