బెంగళూరు సీబీఐ కస్టడీలో నటి హేమ!

June 3, 2024

బెంగళూరు సీబీఐ కస్టడీలో నటి హేమ!

ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీ పెద్ద ఎత్తున సంచలనాలకు కారణమైంది. బెంగళూరుకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త పుట్టినరోజు వేడుకలలో భాగంగా హైదరాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో వ్యాపారవేత్తలతో పాటు రాజకీయ నాయకులు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారందరూ పాల్గొన్నారు. సుమారు వందమంది వరకు ఈ పార్టీకి హాజరయ్యారని తెలుస్తుంది.

ఈ ఫామ్ హౌస్ లో భారీ స్థాయిలో డ్రగ్స్ ఉపయోగిస్తున్నారనే విషయం తెలిసి పోలీసులు రైడ్ చేశారు. అయితే ఈ పార్టీలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి వారు పాల్గొన్నారని అందులో నటి హేమ కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈమె పేరు తెరపైకి రావడంతో ఆమె ఈ పార్టీకి దూరంగా ఉన్నానని చెప్పినప్పటికీ పోలీసులు తనకి నోటీసులు జారీ చేశారు.

ఇక ఈ పార్టీలో తాను పాల్గొనలేదంటూ హేమ వాదించడంతో పోలీసులు తనకు డ్రగ్ టెస్ట్ చేయగా పాజిటివ్ తేలింది. దీంతో విచారణకు హాజరు కావాలని పోలీసులు తనకు నోటీసులు పంపినప్పటికీ ఆమె మాత్రం విచారణకు హాజరు కాలేదు దీంతో బెంగళూరు సీబీఐ పోలీసులు హేమను అదుపులోకి తీసుకున్నారు.

ఇలా పోలీసులు అదుపులో ఉన్నటువంటి హేమను రేపు కోర్టులో హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయి. ఈ పార్టీ గత నేల 20వ తేదీ జరిగింది. అయితే ఇందులో పాల్గొన్నటువంటి వంద మందిలో సుమారు 86 మంది వరకు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Read More: రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించిన బేబమ్మ.. మరీ ఇంత ఇష్టమా?

ట్రెండింగ్ వార్తలు