June 15, 2024
సినీనటి హేమ జైలు నుంచి విడుదల అయ్యారు. సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె గత కొద్ది రోజుల క్రితం బెంగుళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీలో పాల్గొన్నారు. అయితే ఈ పార్టీలో భాగంగా పోలీసులు రైడ్ చేయడంతో ఈమె కూడా పోలీసులకు దొరికారు. అయితే తాను ఈ పార్టీలో లేనని హేమ తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు మాత్రం ఆమె ఈ పార్టీలో పాల్గొన్నటువంటి ఫోటోలను విడుదల చేశారు.
ఇకపోతే హేమ ఈ పార్టీలో పాల్గొనడమే కాకుండా డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు అంతేకాకుండా ఈమెకు పరీక్షలు నిర్వహించగా అందులో పాజిటివ్ తేలడంతో విచారణకు హాజరు కావాలని బెంగళూరు పోలీసు తనకు నోటీసులు పంపినప్పటికీ ఈమె మాత్రం విచారణకు హాజరు కాలేదు దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఇలా జూన్ 14వ తేదీ వరకు ఈమెకు జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. తన రిమాండ్ పూర్తి కావడంతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయింది. ఇలా కండిషన్లతో బెయిల్ మంజూరు కావడంతో హేమ జైలు నుంచి బయటకు వచ్చారు. ఇక ఈమె బెయిల్ మీద బయటకు రావడంతో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఈమెపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇక హేమ పక్కనే ఉన్నటువంటి ఒక వ్యక్తి మీడియాతో మాట్లాడాలని చెప్పగా అలాంటి అవసరం నాకు ఏమీ లేదంటూ ఈమె మీడియాని కూడా లెక్క చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇలా మీడియా పట్ల హేమ వ్యవహరించిన తీరుపై బినాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి బెయిల్ మీద బయటకు వచ్చిన హేమ డ్రగ్ కేసు వ్యవహారం ఎప్పుడు ఇలాంటి మలుపులు తిరుగుతుందో తెలియాల్సి ఉంది.
Read More: ఎన్టీఆర్ దేవర కారణంగా ఆ హీరోలకు భారీ నష్టం.. కంగారులో ఫ్యాన్స్!