సినీనటి హేమకు భారీ షాక్… 10 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్!

June 4, 2024

సినీనటి హేమకు భారీ షాక్… 10 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్!

సినీ నటి హేమను ఇటీవల బెంగళూరు సీబీఐ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా అరెస్టు చేసిన ఈమెను పోలీసుల కోర్టుకు హాజరుపరచగా కోర్టు నుంచి షాకింగ్ ఉత్తర్వులు వెళ్లడయ్యాయి. పది రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనగా మారింది. గత నెల 20వ తేదీ బెంగళూరులోని ఒక ఫామ్ హౌస్ లో హైదరాబాద్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.

ఇక ఈ పుట్టినరోజు వేడుకలో భాగంగా సుమారు 100 మంది వరకు పాల్గొన్నారని తెలుస్తుంది. అయితే ఈ పార్టీలో భారీ స్థాయిలో డ్రగ్స్ వినియోగిస్తున్నారు అనే విషయం పోలీసులకు తెలియడంతో ఈ ఫామ్ హౌస్ పై రైడ్ చేశారు. అక్కడ ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలతోపాటు రాజకీయ నాయకులు అలాగే వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇక ఇదే పార్టీలో పాల్గొన్నటువంటి వారందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయగా సుమారు 86 మంది వరకు డ్రగ్స్ తీసుకున్నట్లు వెళ్లడైంది. ఇలా డ్రగ్స్ తీసుకున్నటువంటి వారిలో సినీనటి హేమ కూడా ఉన్నారు. ఇక ఈమె డ్రగ్స్ టెస్ట్ చేయగా పాజిటివ్ రావడంతో పోలీసులు ఈమెను విచారణకు రావాలని నోటీసులు పంపించారు.

పోలీసులు నోటీసులు పంపినప్పటికీ హేమా విచారణకు హాజరు కాలేదు దీంతో పోలీసులు ఈమెను అరెస్టు చేయాల్సి వచ్చింది. ఇలా అరెస్టు చేసినప్పటికీ ఈమె మాత్రం తాను ఈ పార్టీలో పాల్గొనలేదని ఆ సమయంలో తాను తన ఇంట్లో ఉన్నానంటూ హేమ తన అరెస్టును ఖండించారు అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి ఈమెను కోర్టుకు హాజరు పరిచారు.

ఈనెల 14వ తేదీ వరకు హేమకు జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ పార్టీలో సుమారు వందమంది వరకు పాల్గొనగా ఇందులో 70 మంది పురుషులు 30 మంది మహిళలు ఉన్నారు. అయితే వీరిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read More: నాగార్జున అన్ని కోట్లు సంపాదించడానికి కారణం అదే.. జగపతిబాబు కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు