మీరు సింగిలా? రిలేషన్‌షిప్‌లో ఉన్నారా.. కృతి శెట్టి రియాక్షన్ ఇదే!

June 4, 2024

మీరు సింగిలా? రిలేషన్‌షిప్‌లో ఉన్నారా.. కృతి శెట్టి రియాక్షన్ ఇదే!

టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఇంటి ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే భారీగా పాపులారిటీని సంపాదించుకుంది. ఉప్పెన సినిమాతో ఉప్పెనలా దూసుకు వచ్చింది. ఇకపోతే ఉప్పెన సినిమా తర్వాత ఈమె మాచర్ల నియోజకవర్గం, కస్టడీ, బంగార్రాజు, ది వారియర్, శ్యామ్ సింగరాయ్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ సినిమాలు కృతి శెట్టికి పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయాయి. దాంతో తన తదుపరి సినిమాతో ఎలా అయినా మంచి సక్సెస్ ని సాధించాలి అన్న కసితో ఉంది కృతి శెట్టి.

ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ నటించన తాజా చిత్రం మనమే. ఇందులో శర్వానంద్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా మూవీ మేకర్స్ సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నారు. అందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలోనే ‘మీరు సింగిలా? రిలేషన్‌షిప్‌లో ఉన్నారా? అని హోస్ట్‌ ప్రశ్నించిన కృతి శెట్టి స్పందిస్తూ.. నా పనితో నేను రిలేషన్‌లో ఉన్నాను అంటూ నవ్వులు పూయించింది. అలాగే కాబోయేవాడు ఎలా ఉండాలన్న ప్రశ్నపై స్పందిస్తూ..

నిజాయతీ, ఇతరులపై దయ కలిగి ఉండాలని తెలిపింది. అనంతరం సినిమాల గురించి స్పందిస్తూ.. డ్యాన్స్‌ చేయడమంటే నాకు బాగా ఇష్టం. యాక్షన్‌ కూడా నచ్చుతుంది. నేను హీరోల్లో రామ్‌ చరణ్ అభిమానిని. ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అని తన మనసులో మాటను కూడా బయట పెట్టింది కృతి శెట్టి. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read More: పవన్ కళ్యాణ్ లో ఆవేశం ఆయాసమే తప్ప సాయం చేసే గుణం లేదు.. శ్యామల సంచలన వ్యాఖ్యలు!

Related News

ట్రెండింగ్ వార్తలు