అమెరికాలో అడుక్కుతింటున్నానని ట్రోల్ చేశారు… ఎమోషనల్ అయిన లయ!

May 17, 2024

అమెరికాలో అడుక్కుతింటున్నానని ట్రోల్ చేశారు… ఎమోషనల్ అయిన లయ!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో లయ ఒకరు. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరియర్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే ఈమె పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. ఇలా పెళ్లి చేసుకున్న తర్వాత అమెరికాలో స్థిరపడినటువంటి లయ తిరిగి సినిమాలలో కూడా నటించలేదు.

ఇలా ఇన్ని రోజులపాటు అమెరికాలో ఉన్నటువంటి ఈమె తిరిగి ఇండియా వచ్చేసారు. ఈ క్రమంలోనే పలు సినిమాలలో నటించడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. అయితే నితిన్ హీరోగా నటిస్తున్నటువంటి తమ్ముడు సినిమాలో ఈమె ఓ కీలక పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. ఇలా లయ సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నటువంటి తరుణంలో ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లిపోయిన తర్వాత నా గురించి చాలామంది చాలా రకాలుగా విమర్శలు చేశారని తెలిపారు. తాను అమెరికాలో అడుక్కుతింటూ బ్రతుకుతున్నానని తనకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో రోడ్డున పడ్డాను అంటూ ఎన్నో రకాల విమర్శలు చేశారు.

ఈ విధంగా నా గురించి ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు అవి చూసి చాలా బాధపడ్డానని ఈమె వెల్లడించారు. అయితే తాను అమెరికాలో చాలా సంతోషంగా బ్రతికానని జాబ్ చేస్తూ భారీగానే సంపాదించేదాన్ని అంటూ లయ వెల్లడించారు. అయితే సినిమాలపై ఇష్టంతోనే చాలా రోజులకు తిరిగి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చానని ఈ సందర్భంగా లయ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More: జీవితంలోకి స్పెషల్ పర్సన్ రాబోతోంది.. ప్రభాస్ పోస్ట్ పెళ్లి గురించేనా?

ట్రెండింగ్ వార్తలు