April 1, 2024
రౌడీ హీరో విజయ్ దేవరకొండ త్వరలోనే ఫ్యామిలీ స్టైల్ సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. దిల్ రాజు నిర్మాణంలో పరశురాం దర్శకత్వంలో తెరకేక్కినటువంటి ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా విజయ్ దేవరకొండ ఒకవైపు నటి మృణాల్ ఠాకూర్ మరోవైపు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను వెల్లడించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నటి మృణాల్ విజయ్ దేవరకొండ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సంచలనగా మారాయి అందరూ కూడా విజయ్ దేవరకొండను రౌడీ హీరో ఫ్యామిలీ స్టార్ అంటూ కామెంట్లు చేస్తుంటారు అయితే ఈయన ఈ రెండింటిలో ఏది కాదంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయ్ దేవరకొండను చూడగానే అందరూ కూడా మాస్ హీరో అని అనుకుంటారు కానీ మీరు అనుకున్నట్టు ఆయన మాస్ కాదు చాలా క్లాస్ షూటింగ్ లొకేషన్లోకి వచ్చినప్పుడు విజయ్ దేవరకొండ కాలా కామ్ గా, కూల్ గా ఉంటారని తెలిపింది. తన సీన్స్ ను చాలా డిసిప్లయిన్ గా చేస్తుంటారని చెప్పింది. ఇక ఈయన షూటింగ్ లోకేషన్ లో కనుక ఉంటే చాలా సైలెంట్ గా ఉంటారు అంతేకాకుండా ఏ విషయం గురించి మాట్లాడిన రియాలిటీగా జెన్యూన్ గా మాట్లాడతారని తెలిపారు.
విజయ్ దేవరకొండ గురించి ఒక్క మాటలో కనుక చెప్పాల్సి వస్తే…తాను రౌడీ స్టార్ ఫ్యామిలీ స్టార్లకు మించిన వ్యక్తిత్వం తనది అంటూ విజయ్ దేవరకొండ గురించి మృణాల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా నటి విజయ్ దేవరకొండ గురించి ఇలాంటి కామెంట్స్ చేయడంతో రౌడీ హీరో టాగ్ తగిలించుకున్నటువంటి విజయ్ ఇంత కూల్ పర్సనా అంటూ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Read More: ఆ పని చేతకాకపోతే ఇంటికి వెళ్ళిపో… విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్?