విడాకులకు సిద్ధమైన నటి నమిత… ఇలా క్లారిటీ ఇచ్చేసిందిగా?

May 28, 2024

విడాకులకు సిద్ధమైన నటి నమిత… ఇలా క్లారిటీ ఇచ్చేసిందిగా?

సొంతం సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి నమిత. హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించినటువంటి ఈమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా సక్సెస్ అయినటువంటి నమిత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మెసేజ్ మనకు దూరమైన అనంతరం   పలు బుల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా కూడా హాజరయ్యారు.

ఇలా బుల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తున్నటువంటి నమిత 2017 వ సంవత్సరంలో వీరేంద్ర అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె రాజకీయాలలోకి ఎంత ఇచ్చారు ప్రస్తుతం బీజేపీ పార్టీకి మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఇలా 2017 వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నటువంటి నమిత 2022వ సంవత్సరంలో కవల మగ పిల్లలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నటువంటి నమిత తన భర్త నుంచి దూరమవుతున్నారని ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోబోతున్నారనీ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై నమిత స్పందించి క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా నమిత మాట్లాడుతూ.. నేను నా భర్త విడిపోతున్నాము అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఏ విధమైనటువంటి ఆధారాలతో ఇలాంటి పోస్టులు చేస్తున్నారో అర్థం కావడం లేదని తెలిపారు. అయితే నేను ఇలాంటి వార్తలు రాకముందే తన భర్తతో సంతోషంగా ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశాను. అయినప్పటికీ ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నారు.

తాను హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో ఎన్నో రకాల రూమర్స్ ఎదుర్కొన్నాను. అయితే ఈ విడాకుల రూమర్స్ ను నేను నా భర్త సీరియస్ గా తీసుకోలేదని ఈ వార్తలను చూసి నవ్వుకున్నాము అంటూ ఈ సందర్భంగా నమిత తన విడాకులు గురించి క్లారిటీ ఇచ్చారు.

Read More: మరో అరుదైన గౌరవం అందుకున్న మెగాస్టార్… మెగా ఫ్యామిలీలో మూడు వ్యక్తిగా రికార్డ్?

ట్రెండింగ్ వార్తలు