నాలుగు నెలలకే గర్భస్రావం.. డిప్రెషన్ లోకి వెళ్లిపోయా: నమిత

June 13, 2024

నాలుగు నెలలకే గర్భస్రావం.. డిప్రెషన్ లోకి వెళ్లిపోయా: నమిత

సొంతం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి నమిత. ఇలా మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం తెలుగులో వరుస సినిమాలలో నటించారు. ఇక బిల్లా సినిమా ద్వారా ఎంతో పాపులర్ అయినటువంటి ఈమె అనంతరం కోలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ఇక తమిళ చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నమితకు భారీ స్థాయిలో అభిమానులు పెరిగిపోవడమే కాకుండా ఈమెకు గుడి కూడా కట్టి తమ అభిమానాన్ని నిరూపించుకున్నారు.

ఇలా తెలుగు తమిళ భాష చిత్రాలలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈమె ప్రస్తుతము సినిమాలకు దూరంగా ఉంటూ వ్యక్తిగత జీవితంలో బిజీగా ఉన్నారు. 2017 వ సంవత్సరంలో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఈమె పూర్తిగా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇకపోతే కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో నమిత విడాకులు తీసుకొని విడిపోతుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై నమిత స్పందించి క్లారిటీ ఇచ్చారు. తాజాగా నమిత తన ప్రెగ్నెన్సీ సమయంలో పడిన ఇబ్బందుల గురించి తెలిపారు. నేను నిజానికి 2001వ సంవత్సరంలోనే ప్రెగ్నెంట్ అయ్యాను. ఆ సమయంలో నేను సూరత్ లో ఉన్నాను ఈ విషయం ముందుగా మా నాన్నకు చెప్పాను చాలా సంతోషించారు.

ఇక తాను ప్రెగ్నెంట్ అనే విషయం మా ఆయనకు చెప్పగా తను కూడా ఎంతో సంతోషపడ్డారు. అయితే మా సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు నాలుగు నెలలకే తనకు అబార్షన్ అయిందని ఆ సమయంలో తాను ఎంతో బాధపడటమే కాకుండా.. డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని తెలిపారు. ఇక రెండోసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు ట్విన్స్ ఉన్నారని మూడో నెలలోనే వైద్యులు తెలిపారు.

ఇకపోతే ఏడవ నెల వరకు తన కసలు కడుపేలేదని ఆ సమయంలో తాను ఎంతో కంగారు పడ్డానని తెలిపారు. కానీ ఏడవ నెల నుంచి బేబీ బంప్ కనిపించడంతో కాస్త కుదటపడ్డాను అని తెలిపారు. ఇక ప్రెగ్నెన్సీ సమయంలో మా ఆయన నన్ను కనీసం కాలు కింద పెట్ట.నివ్వలేదు అంటూ అప్పటి విషయాలను నమిత గుర్తు చేసుకొని చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: మోడీని కలిసిన పవన్ కూతురు ఆద్య.. ఎమోషనల్ పోస్ట్ చేసిన రేణు దేశాయ్!

ట్రెండింగ్ వార్తలు