బీచ్ ఒడ్డును క్లీన్ చేస్తూ సందడి చేసిన పూజా హెగ్డే.. వైరల్ అవుతున్న ఫోటోలు!

June 3, 2024

బీచ్ ఒడ్డును క్లీన్ చేస్తూ సందడి చేసిన పూజా హెగ్డే.. వైరల్ అవుతున్న ఫోటోలు!

పూజా హెగ్డే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పుష్కర కాలం పూర్తి అవుతుంది. ఈమె ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాష చిత్రాలలో కూడా నటిస్తూ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి పూజా హెగ్డేకు ప్రస్తుతం మాత్రం సినిమా అవకాశాలు లేవని చెప్పాలి.

ఇటీవల కాలంలో పూజ నటించిన సినిమాలన్నీ కూడా పూర్తిగా ప్రేక్షకులను నిరాశ పరిచాయి .దీంతో ఈమెకు సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. ఇలా సినిమా అవకాశాలు లేక కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె తిరిగి సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. ప్రస్తుతం ఈమె హిందీలో దేవా అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వడం ఈమె కెరియర్ కు చాలా ముఖ్యం అనే చెప్పాలి.

ఇక ఈ సినిమాతో పాటు ఇటీవల ఈమె హీరో సూర్య నటిస్తున్నటువంటి సినిమాలో కూడా ఛాన్స్ అందుకున్నారు. ఇదే విషయాన్ని మేకర్స్ ఇటీవల అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా పూజ హెగ్డే బీచ్ వడ్డున శుభ్రం చేస్తూ సందడి చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ముంబైలోని జుహు బీచ్ ఒడ్డున ఇటీవల ఒక క్లీనింగ్ ప్రోగ్రామ్ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె పర్యావరణాన్ని పరిరక్షించే క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి చెత్తను మొత్తం శుభ్రం చేస్తూ కనిపించారు. దీంతో ఈ ఫోటోలు వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈమెకు పెద్దగా సినిమా అవకాశాలు కూడా లేకపోవడంతో ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని చెప్పాలి.

Read More: పవన్ నాలుగో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసిన వేణు స్వామి.. సంచలనం రేపుతున్న కామెంట్స్?

Related News

ట్రెండింగ్ వార్తలు