డైరెక్టర్ తేజ నా జీవితాన్ని నాశనం చేశారు…సంచలన ఆరోపణలు చేసిన నటి!

July 8, 2024

డైరెక్టర్ తేజ నా జీవితాన్ని నాశనం చేశారు…సంచలన ఆరోపణలు చేసిన నటి!

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి రాశి ఒకరు. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో మంచి గుర్తింపు పొందారు. అయితే ఈమెకు క్రమక్రమంగా సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి కూడా దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రాశి తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

ఈమె సినిమాల ద్వారా కాకుండా బుల్లితెరపై తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. స్టార్ మా లో ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ లో హీరో తల్లి పాత్రలో నటించి తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇలా బుల్లితెర ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈమె ప్రస్తుతం ఇతర సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పట్ల బిజీ అవుతున్నారు. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీగా గడుపుతున్న రాశి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన సినీ కెరియర్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న తనకు ఒకసారిగా అవకాశాలు తగ్గిపోవడానికి కారణం డైరెక్టర్ తేజ అని తెలిపారు. తేజ కారణంగా తాను తన సినీ జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చిందని వెల్లడించారు. తేజ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమాలో ఈమె నెగిటివ్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

మల్లి అనే నెగటివ్ క్యారెక్టర్ లో నటించడమే కాకుండా హీరో గోపీచంద్ తో కలిసి ఈమె మితి మీరిన రొమాన్స్ చేయడం పట్ల ఎంతోమంది అభిమానులు ఈమె నటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఇలా అభిమానులు రాశిని నెగిటివ్ పాత్రలో చూడటానికి పెద్దగా ఇష్టపడలేదు. ఇక ఈ సినిమా కారణంగా తన కెరియర్ కోల్పోవలసి వచ్చిందని తెలిపారు. నిజానికి తేజ సినిమా కథ చెప్పేటప్పుడు ఒకలా చెప్పారు. సినిమా చేసేటప్పుడు మరోలా చేశారు. మొదటిరోజు షూటింగ్స్ స్పాట్ నుంచి తాను వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నాను కాకపోతే అప్పటికే అడ్వాన్స్ తీసుకోవడం వల్ల ఇష్టం లేకపోయినా నటించాల్సి వచ్చిందని వెల్లడించారు

Related News

ట్రెండింగ్ వార్తలు