మళ్లీ జబర్దస్త్ లోకి రోజా… జబర్దస్త్ కి రానున్న పూర్వ వైభవం?

June 5, 2024

మళ్లీ జబర్దస్త్ లోకి రోజా… జబర్దస్త్ కి రానున్న పూర్వ వైభవం?

బుల్లితెర పై ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం ఒక కామెడీ షో గా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ప్రస్తుతం హీరోలుగాను దర్శకులుగాను కొనసాగుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు.

ఇక ఈ కార్యక్రమం 2013 వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ప్రారంభమైన సమయంలో ఈ కార్యక్రమానికి సినీనటి రోజా అలాగే నాగబాబు జడ్జిలుగా వ్యవహరించేవారు. ఇక మల్లెమాల వారితో వచ్చిన మనస్పర్ధలు కారణంగా నాగబాబు ఈ కార్యక్రమం నుంచి తప్పకున్నా ఆయన స్థానంలో సింగర్ మను అలాగే కృష్ణ భగవాన్ వంటి వారందరూ కూడా వచ్చి వెళ్లారు..

ఇక రోజా మాత్రం అలాగే ఈ కార్యక్రమానికి జడ్జిగా కొనసాగుతున్నారు. ఇక ఈమె ఈ కార్యక్రమంలో ఉన్నప్పుడు ఎంతో సరదాగా ఉండటమే కాకుండా జడ్జి సీట్లో కూర్చొని పెద్ద ఎత్తున సెటైర్లు వేస్తూ ఈ కార్యక్రమానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఇలా ఈమె రాజకీయాలలో కొనసాగుతూ ఎమ్మెల్యే అయినప్పటికీ జబర్దస్త్ కార్యక్రమానికి వచ్చారు..

ఇక రోజాకు మంత్రి పదవి రావడంతో మంత్రిగా తనకు మరిన్ని బాధ్యతలు పెరిగాయని అందుకే ఈ కార్యక్రమం నుంచి తప్పుకుంటున్నానని కార్యక్రమం నుంచి బయటకు వెళ్లారు. ఇక ఈమె బయటకు వెళ్లడంతో ఈమె స్థానంలో నటి ఇంద్రజ జడ్జిగా కొనసాగారు. అయితే ఇటీవల కాలంలో ఇంద్రజ కూడా తాను కాస్త విరామం ఇస్తున్నానంటూ జబర్దస్త్ నుంచి తప్పుకున్నారు.

ఇక ఇంద్రజ కూడా ఈ కార్యక్రమానికి విరామం ఇస్తున్నానని చెప్పడంతో ఈ కార్యక్రమానికి జడ్జిగా ఎవరు ఉంటారనే సందేహం అందరిలోనూ ఉంది అయితే ప్రస్తుతం 2024వ సంవత్సరంలో కూటమి భారీ మెజారిటీతో గెలవడంతో రోజా ఓటమిపాలు అయ్యారు. దీంతో ఈమె తిరిగి జబర్దస్త్ కార్యక్రమానికి రాబోతున్నారని తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే జబర్దస్త్ కార్యక్రమానికి తిరిగి పూర్వ వైభవం వస్తుందని చెప్పాలి.+

Read More: పెళ్లయిన హీరోయిన్స్ అంటే వాళ్లకు నచ్చరు.. కాజల్ సంచలన వ్యాఖ్యలు!

Related News

ట్రెండింగ్ వార్తలు