బిగ్ బాస్ వల్ల నాగార్జునకు తప్ప ఎవరికి లాభం లేదు.. నటి సంచలన వ్యాఖ్యలు!

July 8, 2024

బిగ్ బాస్ వల్ల నాగార్జునకు తప్ప ఎవరికి లాభం లేదు.. నటి సంచలన వ్యాఖ్యలు!

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న రియాలిటీ షో లలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే ఇటీవల జరిగిన సీజన్ సెవెన్ కార్యక్రమంలో భాగంగా ఒక కామన్ మ్యాన్ హౌస్ లోకి వెళ్లి విజేతగా బయటకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నటి షకీలా కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. అయితే ఈమె హౌస్ లోకి వెళ్లిన రెండు వారాలకి హౌస్ నుంచి బయటకు వచ్చారు.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా బిగ్ బాస్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలోకి వెళ్లిన తర్వాత నాకు అమర్, ప్రియాంక, దామిని, సందీప్ మాస్టర్ ఈ నలుగురే చాలా నిజాయితీగా కనిపించారు. ఇక శివాజీ గారు న్యూట్రల్ గా ఉంటారని తెలిపారు.

ఇక కామన్ మ్యాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి పిల్లి లాగా ఎంట్రీ ఇచ్చి కాస్త పేరు రాగానే చాలా పొగరు చూపించారని కళ్ళు నెత్తికెక్కాయని తెలిపారు. తనముందు సీనియర్ ఆర్టిస్టులు ఉన్న కాలు మీద కాలు వేసుకొని కూర్చునే వారు. పైకి కనిపించే అంత మంచివాడు కాదు పల్లవి ప్రశాంత్ అంటూ ఆరోపణలు చేశారు.

బిగ్ బాస్ కార్యక్రమం వల్ల నాకు వచ్చిన ప్రయోజనం ఏమీ లేదని తెలిపారు. ఏదో వారి షో పాపులారిటీ కోసం నన్ను పిలుచుకున్నారు. ఆ షో కాస్త పాపులర్ అవగానే నన్ను బయటకు పంపించారని తెలిపారు. వాళ్లు పేమెంట్ ఇచ్చారు నేను వెళ్ళాను అంతేనని తెలిపారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమం వల్ల ఎవరికైనా లాభం ఉందా అంటే అది కేవలం నాగార్జున గారికి మాత్రమే ఉందని తెలిపారు. ఎందుకంటే ఈ సెట్ మొత్తం అన్నపూర్ణ స్టూడియోలోనే ఉంటుంది ఇక ఈ కార్యక్రమానికి నాగార్జున హోస్ట్ కావడంతో ఆయనకు మాత్రమే లాభం అంటూ షకీలా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి

Related News

ట్రెండింగ్ వార్తలు