November 20, 2024
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ సినిమా విశేషాలని పంచుకున్నారు.
నేను ఒక ఆర్మీ ఫ్యామిలీలో పుట్టాను. ప్రతి రెండేళ్ళకోసారి స్టేట్ షిఫ్ట్ అవుతుంటాము. సహజంగానే నాకు డిఫరెంట్ థింగ్స్ ఎక్స్ పీరియన్స్ చేయడం ఇష్టం. ‘మెకానిక్ రాకీ`లో ఇప్పటివరకూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. ఇది నాకు చాలా ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్. ఒక ఛాలెంజ్ తీసుకొని చేశాను. మాయ క్యారెక్టర్ ని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. అలాగే విశ్వక్ తో కలసి నటించడం చాలా ఎక్సయిటెడ్ గా అనిపించింది. మెకానిక్ రాకీ జీవితంలో మాయ ఎలాంటి రోల్ ప్లే చేసిందనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. విశ్వక్ ఆన్ స్క్రీన్ ఎనర్జీని మ్యాచ్ చేయడం కష్టం. అఫ్ స్క్రీన్ తను చాలా సరదాగా వుంటారు. ఆయనతో వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. నాకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్స్ లేరు. ప్రతి సినిమా ఒక లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ గా తీసుకొని ముందుకు వెళుతున్నాను. ఈ జర్నీలో హైస్ అండ్ లోస్ వున్నాయి. జెర్సీ తర్వాత పీక్స్ చూశాను. కోవిడ్ లో సినిమాలు ఆగినప్పుడు అందరిలానే నేనూ భయపడ్డాను. నా సినీ జర్నీ జీవితంలానే అలా ముందుకు సాగుతోంది. హిట్స్, ఫ్లాప్స్ ని ఒకేలా తీసుకోవడం అలవాటు చేసుకున్నాను. నాకు క్యాలిటీ వర్క్స్ చేయడం ఇష్టం. అందుకే కొంచెం సెలెక్టివ్ గా వుంటాను. చూడటాని హారర్ జోనర్ ఇష్టం. ‘కల్కి’ లాంటి సైన్స్ ఫిక్షన్ కథల్లో నటించడానికి ఇష్టపడతాను. అలాగే బాహుబలి లాంటి పిరియడ్ సినిమాలో పార్ట్ అవ్వాలని వుంటుంది. అలాగే కామెడీ సినిమాల్లో కూడా చేయాలని వుంది. మెకానిక్ రాకీ తర్వాత నాకు ఇంకా డిఫరెంట్ రోల్స్ వస్తాయని భావిస్తున్నాను.