June 4, 2024
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన అధ్యక్షుడిగా ఏపీ రాజకీయాలలో కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే నేటి ఎన్నికల ఫలితాలు రాబోతున్న నేపథ్యంలో యాంకర్ శ్యామల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
యాంకర్ శ్యామల వైఎస్ఆర్సిపి పార్టీకి అనుకూలంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమె ఇంటర్వ్యూ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు . నా ఉద్దేశం ప్రకారం రాజకీయ నాయకుడు అంటే చాలా ఉన్నతంగా ఆలోచించాలి ఆవేశం పడకూడదు కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం అలా కాదు ఆయన ఎప్పుడూ ఆయాస పడుతుంటాడు ఆవేశపడుతుంటాడు గట్టిగటిగా అరుస్తూ ఉంటాడు.
పవన్ కళ్యాణ్ లో తాను ఆవేశం,ఆయాసం తప్ప సాయం చేసే గుణం చూడలేదని శ్యామల వెల్లడించారు. ఇక పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో వంగా గీత గెలుస్తారని ఈమె చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు పవన్ కళ్యాణ్ గెలుస్తారని చెప్పినప్పటికీ నేడు వెలబడే ఎన్నికల ఫలితాలలో వంగా గీత గారు గెలుస్తారని శ్యామల వెల్లడించారు.
ఇలా పవన్ కళ్యాణ్ గురించి యాంకర్ శ్యామల చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సహాయం చేయడం చూడలేదా కౌలు రైతులకు తన సొంత డబ్బును అందించారు అంటూ కొందరు ఈమెపై బూతులతో ట్రోల్ చేస్తున్నారు. ఇక జూన్ 4వ తర్వాత మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకో అంటూ మరి కొందరు వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు. మొత్తానికి మరోసారి జనసేన నాయకులు కార్యకర్తలను గెలికి శ్యామల ట్రోల్స్ ఎదుర్కొంటున్నారని చెప్పాలి.
Read More: సినీనటి హేమకు భారీ షాక్… 10 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్!