ఆ హీరో పై మనసు పారేసుకున్న సుప్రీత.. ఏకంగా పెళ్లి చేసుకోవాలనుకుంటుందా?

May 3, 2024

ఆ హీరో పై మనసు పారేసుకున్న సుప్రీత.. ఏకంగా పెళ్లి చేసుకోవాలనుకుంటుందా?

సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సురేఖ వాణి ఒకరు. ఈమె ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలలో వివిధ రకాల పాత్రలలో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె తన కుమార్తె సుప్రీతను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

ఇలా సుప్రీత హీరోయిన్ గా ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తూ కెరియర్ పట్ల బిజీ అవుతున్నారు.ఇలా బిజీగా ఉన్నటువంటి సుప్రీత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. వెకేషన్ లకి వెళ్లడం పార్టీలు అంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించిన అన్ని వీడియోలు ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా కనిపించే ఈమె తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ తన పెళ్లి గురించి ప్రశ్నించారు. ఒకవేళ మీరు ఎవరినైనా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఆ పెళ్లి కాని హీరో ఎవరు అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు సుప్రీత సమాధానం చెబుతూ ఏకంగా విజయ్ దేవరకొండ ఫోటోని షేర్ చేశారు. దీన్నిబట్టి చూస్తుంటే ఈమె ఈ హీరో పై మనసు పారేసుకుందని పెళ్లి చేసుకోవాలనుకుంటే అతనే చేసుకోవాలని ఉంది అంటూ ఈమె తన మనసులో కోరికను ఇలా బయటపెట్టారని తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం ఈమె సినిమా విషయానికి వస్తే ఇంకా ఈమె చేస్తున్నటువంటి సినిమాకు టైటిల్ అనౌన్స్ చేయకపోయినా బుల్లితెర నటుడు బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్ చౌదరి హీరోగా రాబోతున్నటువంటి సినిమాలో హీరోయిన్ గా సురేఖ వాణి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

Read More: తండ్రి చిరంజీవి కోసం సింగర్ గా మారిన రామ్ చరణ్.. ఏమైందంటే?

Related News

ట్రెండింగ్ వార్తలు