హనుమాన్ జయంతిన ఆదిపురుష్ నుంచి అద్భుతమైన సాంగ్ తో ఫస్ట్ లుక్ రిలీజ్

April 7, 2023

హనుమాన్ జయంతిన ఆదిపురుష్ నుంచి అద్భుతమైన సాంగ్ తో ఫస్ట్ లుక్ రిలీజ్

ఇండియాస్ టాప్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన సినిమా ఆదిపురుష్. ఓమ్ రౌత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందించారు. ప్రభాస్ రాముడుగా, కృతి సీత పాత్రలో నటించిన ఈ మూవీలో హనుమంతుడుగా దేవదత్త నాగే నటించారు. ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా దేవదత్త నాగు హనుమంతుడు గెటప్ లో ఉన్న లుక్ ను విడుదల చేశారు. దీంతో పాటు రిలీజ్ చేసిన ఓ పాట ట్యూన్ తో పాటు లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ పాట చూస్తే బ్యాక్ గ్రౌండ్ అదిరిపోతుందని ముందే అనిపిస్తోంది. హనుమంతుడు అంటే బలం, పట్టుదల, విధేయత మూర్తీభవించిన యోధుడు. ఆ విషయమే హైలెట్ అయ్యేలా ఆదిపురుష్  మేకర్స్  శ్రీ బజరంగ్ బలి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రభు శ్రీరాముని సహచరుడు, సంరక్షకుడుగా ఆ రామునికి నివాళులు అర్పిస్తున్నట్టుగా ఉన్న ఈ లుక్ తో హనుమాన్ జయంతి మరింత సంబురంగా మారింది.

త్వరలోనే ప్రమోషన్స్ ను మరింత వేగంగా మొదలుపెట్టబోతోంది ఆదిపురుష్ టీమ్.

ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్‌ను టి-సిరీస్, భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్ మరియు రెట్రోఫిల్స్‌కు చెందిన రాజేష్ నాయర్, UV క్రియేషన్స్‌కు చెందిన వంశీ మరియు ప్రమోద్‌ల సహకారంతో నిర్మించారు. ఈ చిత్రం 2023 జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ట్రెండింగ్ వార్తలు