సిద్దార్థ్‌కి స్పెషల్ గా బర్త్డే విషెస్ చెప్పిన అదితి.. పోస్ట్ వైరల్?

April 18, 2024

సిద్దార్థ్‌కి స్పెషల్ గా బర్త్డే విషెస్ చెప్పిన అదితి.. పోస్ట్ వైరల్?

ఇటీవల కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో సిద్ధార్థ్ అదితి రావు హైదరి పేర్లు కూడా ఒకటి. గత కొద్దిరోజులుగా ఈ జంట పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల వీరు ఇటీవలే వారి ప్రేమని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. గత నెలలో ఎంగేజ్మెంట్ రింగులు మార్చుకొని తమ ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి వైపు మలుపు తిప్పారు. త్వరలోనే ఏడడుగులు వేయనున్నారు. కాగా తాజాగా ఏప్రిల్ 17న సిద్దార్థ్ పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీస్ అందరూ సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు.

అయితే ఎంత మంది ఎన్ని విషెస్ చెప్పినా కూడా అభిమానులు మాత్రం అదితి నుంచి ఎలాంటి విషెస్ వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఇక నెటిజెన్స్ ఎదురు చూపులకు తెరదించుతూ అదితి.. తన ఫియాన్సీకి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ పోస్ట్ వేశారు. హాపిస్ట్ బర్త్ డే మై మానికార్న్ అంటూ పోస్ట్ చేసింది. మానికార్న్ అంటే.. ఒకే లక్షణాలు, ఇష్టాలు కలిగి ఉన్న వ్యక్తిని మరో వ్యక్తి సంబోధించడం కోసం ఉపయోగించే పదం. అలాగే మరికొంత నోట్ కూడా అదితి రాసుకొచ్చింది.

ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉండే నీకు.. మరింత శక్తి చేకూరాలని, నువ్వు అనుకున్నవి జరగాలని కోరుకుంటున్నాను అని రాసుకొచ్చింది అదితి. ఈ నోట్ తో కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిద్దార్థ్ తెలుగులో చివరగా మహాసముద్రం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

Read More: ప్రభాస్ న్యూ లుక్ చూశారా.. మునుపటిలా మారిపోయిన డార్లింగ్.. లుక్ మాములుగా లేదంటూ?

Related News

ట్రెండింగ్ వార్తలు