May 27, 2024
టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ గురించి మనందరికీ తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు తన విడుదల సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ తెలుగులో చాలా సినిమాలలో హీరోగా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నాడు. ఇకపోతే వరుణ్ తేజ్ గత ఏడాది హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పర్సనల్ లైఫ్ సంతోషంగా ఉన్నప్పటికీ సినిమా కెరియర్ మాత్రం వరుణ్ కి చాలా ఇబ్బందికరంగా మారింది.
ఈ మధ్యకాలంలో వరుణ్ కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమా ఒకటి కూడా పడడం లేదు. సోలో హీరోగా ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ అతడికి చేదు అనుభవాలను మిగిల్చాయి. ఇలా వరుణ్ నటించిన సినిమాలు అన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవడంతో వర్మ కెరియర్ పూర్తిగా దెబ్బతింది. దీంతో ఎలాంటి కథలను ఎంచుకోవాలి ఏ దర్శకుడి డైరెక్షన్లో నటించాలో తెలియక కాస్త డైలమాలో ఉన్నాడు వరుణ్ తేజ్. ఇకపోతే ఇప్పటికే కమిట్ అయిన మట్కా సినిమా ముందుకు సాగడం లేదు.
అంతే కాకుండా ఈ సినిమా ఉంటుందో ఉండదో కూడా తెలియని పరిస్థితి. దీంతో ప్రస్తుతం వరుణ్ తేజ్ ఏ సినిమాలో నటించకుండా ఖాళీగానే ఉంటున్నాడు. ఈలోపు వరుణ్ కొత్త సినిమా ఒకటి ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అది శేఖర్ కమ్ములతో కావడం విశేషం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ నటించిన ఫిదా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికి తెలిసిందే. అది వరుణ్ కెరీర్లో ఒక మరపురాని జ్ఞాపకంగా చెప్పుకో దగ్గ సినిమాగా నిలిచింది. మళ్లీ ఇప్పుడు కమ్ములతో ఒక సినిమా చేయడానికి అతను సిద్ధమయ్యాడట. ప్రస్తుతం ధనుష్‌తో కుబేర అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న కమ్ముల దీని తర్వాత వరుణ్‌తో చేసేందుకు ఒక కథను రెడీ చేశాడట. ప్రస్తుతం కథా చర్చలు పూర్తి అయ్యాయని త్వరలోనే సినిమాను అనౌన్స్ చేస్తారని అంటున్నారు. ఈ సినిమాకు నిర్మాత ఎవరన్నది తెలియదు. ఒక కొత్త జానర్లో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే మరి శేఖర్ కమ్ముల అయిన వరుణ్ కీ మంచి సక్సెస్ ని ఇచ్చి గట్టేక్కిస్తారో లేదో చూడాలి మరి.
Read More: ప్రభాస్ బుజ్జిని నడిపిన హీరో నాగ చైతన్య.. ఫోటోస్ వైరల్!