ధనుష్ లేకుండా కొత్తింట్లోకి అడుగుపెట్టిన ఐశ్వర్య రజనీకాంత్!

May 3, 2024

ధనుష్ లేకుండా కొత్తింట్లోకి అడుగుపెట్టిన ఐశ్వర్య రజనీకాంత్!

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి నటుడు ధనుష్ తన భార్య ఐశ్వర్య రజనీకాంత్ నుంచి వేరుగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి జరిగినటువంటి 18 సంవత్సరాలకు విడాకులు తీసుకొని విడిపోవాలనుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా ప్రస్తుతం వేరువేరుగా ఉంటున్నారు కానీ ఇంకా వీరికి విడాకులు మాత్రం రాలేదని తెలుస్తుంది.

వీరి విడాకులకు సంబంధించినటువంటి కేసు తమిళనాడు ఫ్యామిలీ కోర్టులో పెండింగ్ ఉంది. ఈ విధంగా తన భర్తతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా తన భర్తకు దూరంగా ఉన్నటువంటి ఈమె ఇప్పటివరకు తన తండ్రి రజనీకాంత్ వద్ద ఉన్నారు. అయితే ఇటీవల ఐశ్వర్య కొత్త ఇంటిని కొనుగోలు చేశారు.

ఒక అపార్ట్మెంట్ లో డూప్లెక్స్ ప్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అన్ని సౌకర్యాలతో ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి ఈ ఇంటిని భారీ ధరలకే కొనుగోలు చేశారని తెలుస్తోంది. తాజాగా ఈ ఇంట్లోకి ఐశ్వర్య గృహప్రవేశం చేశారు. చాలా సింపుల్ గా ఈమె తన సోదరి, కొడుకులతో పాటు తల్లిదండ్రులతో కలిసి ఈ గృహప్రవేశ కార్యక్రమాలను నిర్వహించారని తెలుస్తుంది.

తాజాగా ఈ గృహప్రవేశానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ గృహప్రవేశ కార్యక్రమానికి తన భర్త ధనుష్ రాకపోవడం గమనార్హం. ఈమె తన భర్త నుంచి ఇంకా విడాకులు తీసుకోకపోయిన మనస్పర్ధలు కారణంగానే విడిపోయి తన తల్లిదండ్రుల వద్ద ఉన్నారు. అయితే పిల్లల స్కూల్ ఫంక్షన్ల కోసం ఇద్దరూ కలిసి వెళ్తారు. ఒకరి సినిమాలకు ఒకరు ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి తరుణంలో ఈ గృహప్రవేశ కార్యక్రమానికి ధనుష్ రాకపోవడంతో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. ఇక ధనుష్ సైతం ఏకంగా వందల కోట్ల విలువ చేసే లగ్జరీ ఇంటిని నిర్మించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈయన కూడా తన భార్య ఐశ్వర్య లేకుండా గృహప్రవేశం చేసిన సంగతి తెలిసిందే.

Read More: పవన్ ప్రశాంతత కోసం అలాంటి సినిమాలు చూస్తారా.. ఈ అలవాటు ఏంది సామీ?

ట్రెండింగ్ వార్తలు