January 3, 2022
AjayBhupathiaboutRGV: నిన్న చిరంజీవి, మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇండస్ట్రీ పెద్దగా ఎవరనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. దర్శకరత్న దాసరి నారాయణ లోటు తీరుస్తూ ఆయన స్థానంలో ఉండి పరిశ్రమను ముందుండి నడిపించే పెద్ద దిక్కు ఎవరా? అనే దానిపై ఇండస్ట్రీలో సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఈ క్రమంలో ఆర్‌ఎక్స్ 100, మహా సముద్రం వంటి ఒక హిట్టు, ఒక ప్లాఫు సినిమాలు తీసిన దర్శకుడు అజయ్ భూపతి చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. తన బాస్ రాంగోపాల్ వర్మని ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చూడాలన్నది తన ఆశ అని పేర్కొన్నాడు. ‘సామీ మీరు రావాలి సామీ’ అంటూ అజయ్ భూపతి రాసుకొచ్చిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్‌గా మారింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టిక్కెట్ల వివాదంపై చర్చ నడుస్తున్న క్రమంలో ఆర్జీవీ వరస ట్వీట్లు చేస్తూ తనదైన శైలిలో స్పందిస్తున్న సంగతి తెలిసిందే.
మా బాస్ ( రాంగోపాల్ వర్మ ) ని ఇండస్ట్రీకి పెద్ద దిక్కు గా చూడాలని నా కోరిక…
— Ajay Bhupathi (@DirAjayBhupathi) January 2, 2022
సామీ మీరు రావాలి సామీ 🥳😎#ఇండస్ట్రీపెద్ద @RGVzoomin pic.twitter.com/0Y3Nnf0w48