ఓటీటీ లో భారీ రేట్ పలికిన అజిత్ మూవీ.. ద గోట్ మూవీ ని వెనక్కి నెట్టిన గుడ్ బాడ్ అగ్లీ!

May 23, 2024

ఓటీటీ లో భారీ రేట్ పలికిన అజిత్ మూవీ.. ద గోట్ మూవీ ని వెనక్కి నెట్టిన గుడ్ బాడ్ అగ్లీ!

తమిళ ఇండస్ట్రీలో విజయ్, అజిత్ ఇద్దరు టాప్ స్టార్స్. ఇద్దరు సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి. ఒకరు ఒకసారి నెగ్గితే మరొకరు ఇంకొకసారి నెగ్గుతారు. ఈసారి కూడా వారిద్దరి సినిమాలు పోటీలు పడుతున్నాయి. విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా ద గోట్ కాగా అజిత్ హీరోగా నటిస్తున్న సినిమా గుడ్ బాడ్ అగ్లీ. అయితే ఈసారి అజిత్ మూవీ గుడ్ బాడ్ అగ్లీ పోటీలో నెగ్గినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఓటీటీ లో ఈ సినిమాకి ఏకంగా 95 కోట్ల భారీ ఆఫర్ వచ్చినట్లుగా సమాచారం.

అయితే ద గోట్ సినిమాకి 110 కోట్ల ఆఫర్ వచ్చింది. అంటే అజిత్ సినిమా కన్నా 15 కోట్లు ఎక్కువ. అయినా అజిత్ ఎలా గెలిచాడు అనుకుంటున్నారా అక్కడే ఉంది ట్విస్ట్. విజయ్ గోట్ సినిమాకి అన్ని భాషలు కలిపి అంటే హిందీ కూడా కలుపుకొని జరిగిన డీల్ తో 110 కోట్లు పలికింది. అయితే అజిత్ సినిమా కేవలం తమిళం లేదా సౌత్ ఇండియా భాషల వరకే ఈ ధర పలికినట్లు సమాచారం వినిపిస్తుంది. అందుకే విజయ్ కన్నా అజిత్ సినిమా పొటెన్షియల్ ఎక్కువ అంటున్నారు సినీ క్రిటిక్స్.

ద గోట్ సినిమా విషయానికి వస్తే తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటిస్తూ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి వెంకటేశ్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని సెప్టెంబర్ ఐదున విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ చెప్పారు. ఇక అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న గుడ్ బాడ్ అగ్లీ సినిమా విషయానికి వస్తే రవిచంద్రన్ డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2025 పొంగల్ సందర్భంగా విడుదలకు సిద్ధం చేస్తున్నారు మూవీ మేకర్స్.

Read More: డ్రగ్స్ కేసులో పాజిటివ్ రావడం పై ఘాటుగా స్పందించిన హేమ.. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ?

Related News

ట్రెండింగ్ వార్తలు