బాలయ్య బర్త్ డే స్పెషల్.. అఖండ సీక్వెల్ ప్రకటించిన బోయపాటి?

June 10, 2024

బాలయ్య బర్త్ డే స్పెషల్.. అఖండ సీక్వెల్ ప్రకటించిన బోయపాటి?

నందమూరి నటసింహం బాలకృష్ణ నేడు (జూన్ 10) పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. బాలయ్య పుట్టినరోజు కావడంతో ఇప్పటికే ఈయన నటిస్తున్న సినిమాల నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. అదే విధంగా కొత్త సినిమాల గురించి కూడా ప్రకటనలను తెలియజేస్తున్నారు. ఇక ఇటీవల బాలకృష్ణ హిందూపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలవడంతో అక్కడ కూడా సంబరాలు మొదలయ్యాయి. ఇక బాలయ్య కూడా హిందూపురంలోనే తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.

ఇక అభిమానుల సైతం సోషల్ మీడియా వేదికగా బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ బాలకృష్ణ రేర్ ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇక బాలకృష్ణ పుట్టిన రోజు కావడంతో దర్శకుడు బోయపాటి శ్రీను కొత్త సినిమా ప్రకటన తెలియజేశారు. బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక చివరిగా వీరిద్దరి కాంబినేషన్లో అఖండ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాకు మంచి ఆదరణ లభించడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని కూడా ప్రకటించారు. అయితే త్వరలోనే ఈ సినిమా రాబోతుందని తెలుస్తోంది. తాజాగా బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆఖండ సీక్వల్ గురించి బోయపాటి క్లారిటీ ఇస్తూ పోస్టర్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా బాలయ్య బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఆఖండ సీక్వెల్ గురించి పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రామ్ ఆచంట – గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వీరిద్దరి కాంబోలో నాలుగో సినిమాగా నేడు సినిమాని ప్రకటించారు. BB4 వర్కింగ్ టైటిల్ తో ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక మరో విషయం ఏంటంటే ఈ సినిమాకు నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించడం విశేషం.

Read More: నా ఫీలింగ్స్ కి విలువలేదు.. కామెడీలు చేస్తున్నారు.. ఆవేదన వ్యక్తం చేసిన రేణు దేశాయ్!

ట్రెండింగ్ వార్తలు