మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బాల‌కృష్ణ మాస్ జాత‌ర అఖండ‌

December 14, 2021

మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బాల‌కృష్ణ మాస్ జాత‌ర అఖండ‌

నటసింహ నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్ క్లబ్‌లోకి చేరింది.

రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ అఖండను ఓవర్సీస్‌లో భారీ ఎత్తున విడుదల చేసింది. అక్కడ ఎన్నో రికార్డులను అఖండ బ్రేక్ చేసింది. రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసిన మొదటి సినిమా అఖండ. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. ఆస్ట్రేలియా, యూకే, గల్ఫ్ దేశాల్లోనూ అఖండ మంచి సక్సెస్ సాధించింది.

ఓవర్సీస్‌లో ఇంకా ఈ సినిమా అన్ స్టాపబుల్‌గా దూసుకుపోతోంది. బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక గ్రాస్ కొల్లగొట్టే సినిమాగా అఖండ నిలిచిపోనుంది. వీకెండ్‌లో కలెక్షన్ల వర్షం కురుస్తుండగా.. వీక్ డేల్లో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది.

ట్రెండింగ్ వార్తలు