ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న అఖిల్ ఏజెంట్…ఎప్పుడంటే?

July 9, 2024

ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న అఖిల్ ఏజెంట్…ఎప్పుడంటే?

Akhil Akkineni Agent Ott Release: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అఖిల్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు నటుడు అక్కినేని అఖిల్. నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు అయితే ఈయన ఇప్పటివరకు పలు సినిమాలలో నటించిన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందివ్వలేకపోయింది. ఇకపోతే ఈయన చివరిగా ఏజెంట్ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు..

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా పట్ల ప్రేక్షకులలో ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ ప్రేక్షకుల అంచనాలను చేరుకోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పాలి. ఇక ఈ సినిమా విడుదల అయ్యి ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేకపోవడంతో అభిమానులు మరోసారి నిరుత్సాహం వ్యక్తం చేశారు.

సాధారణంగా ఒక సినిమా ఫ్లాప్ అయితే కనుక నెల కూడా తిరగకుండానే ఆ సినిమాలను ఓటీటీలో అందుబాటులోకి తీసుకు వస్తారు కానీ ఈ సినిమా విడుదలయ్యి దాదాపు ఏడాది కూడా పూర్తయింది కానీ ఇప్పటివరకు ఈ సినిమాని డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి తీసుకు రాలేకపోతున్నారు. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను సోనీ లివ్ సొంతం చేసుకొని డేట్ కూడా ఫిక్స్ చేసుకుంది. కానీ ఇంకా రాలేదు దాదాపు ఏడాది దాటిపోయినా కూడా ఈ సినిమా ఓటిటిలో రాలేదు దీనితో ఈ చిత్రం ఓ రేంజ్ హైప్ ని ఓటిటి వెర్షన్ కి కూడా తెచ్చుకుంది.

ఫైనల్ గా ఈ సినిమా తెలుగు కాకుండా హిందీలో టీవీ ప్రీమియర్ గా రిలీజ్ కి సిద్ధం అయ్యింది. మరి తెలుగు ఎప్పుడు అంటే దానిపైనే లేటెస్ట్ టాక్ వినిపిస్తుంది. అయితే తెలుగులో మాత్రం జూలై మూడవ వారంలో ఈ సినిమా సోనీ లీవ్ లో ప్రసారానికి సిద్ధమవుతుందని తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు