‘ఒకే ఒక జీవితం’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసి త‌న త‌ల్లికి అంకిత‌మిచ్చిన అఖిల్ అక్కినేని

January 26, 2022

‘ఒకే ఒక జీవితం’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసి త‌న త‌ల్లికి అంకిత‌మిచ్చిన అఖిల్ అక్కినేని

Akhil Akkineni Launches First Single From Oke Oka Jeevitham And Dedicates It To Amala Akkineni: యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతోన్న చిత్రం `ఒకే ఒక జీవితం` ఈ సినిమాతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయమ‌వుతున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప‌తాకంపై ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మించారు.

జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. నేడు ఈ మూవీలోని అమ్మ పాటను అఖిల్ అక్కినేని విడుదల చేసి త‌న‌ తల్లి అమ‌ల అక్కినేనికి ఈ పాట‌ను అంకితం ఇచ్చారు.

ఈ పాటలో సిధ్ శ్రీరామ్ గాత్రం ప్రత్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. అమ్మ గొప్పదనం చెప్పేందుకు స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అద్భుతమైన సాహిత్యాన్ని సమకూర్చారు. చాలా కాలం తరువాత ఇలా హృదయాన్ని హత్తుకునేలా సాగే అమ్మ పాట ఇది.

ఫ్యామిలీ డ్రామాగా రాబోతోన్న ఈ సైన్స్ ఫిక్ష‌న్ చిత్రానికి తరుణ్ భాస్కర్ మాటల రచయిత. ఈ మూవీని ఈ ఏడాదిలో విడుదల చేసేందుకు మేకర్లు ప్లాన్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు