Pawan Kalyan OG movie: తండ్రి సినిమాపై ఫోకస్ చేసిన అకీరా..

July 3, 2024

Pawan Kalyan OG movie: తండ్రి సినిమాపై ఫోకస్ చేసిన అకీరా..

సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈయన రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉండడమే కాకుండా ఉపముఖ్యమంత్రిగా మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకొని ఆయా శాఖలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి కేవలం రాజకీయాలలోనే బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ గతంలో ఓడిపోయిన తర్వాత ఇండస్ట్రీలో హీరోగా కొనసాగిన సంగతి మనకు తెలిసిందే. ఈయన హీరోగా వరుస సినిమాలకు కమిట్ అవుతూ వచ్చారు. అయితే ఈయన కమిట్ అయిన కొన్ని సినిమాల్లో సగం వరకు షూటింగ్ పనులు పూర్తి అయ్యాయి. మిగతా సగం సినిమాల షూటింగ్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇక పవన్ కళ్యాణ్ రాక కోసం దర్శక నిర్మాతలు కూడా ఎదురుచూస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్, ఓ జీ సినిమాలలో నటిస్తున్నారు. ఈ సినిమాలన్నీ కూడా ప్రస్తుతం షూటింగ్ పనులు సగం వరకు పూర్తి అయ్యాయి. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా తన తండ్రి సినిమాపై ఫోకస్ చేయడమే కాకుండా తన తండ్రిని ఒక గ్యాంగ్ స్టర్ గా చూడటం కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఓజీ. ఈ సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా ఇందులో పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్ స్టర్ గా వెండి తెరపై సందడి చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం ఆకీరా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని ఇటీవల హీరో అడివి శేష్ తాజా కామెంట్స్ వైరల్ గా మారాయి.

ఇక ఇటీవల కాలంలో అకీరా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత ఈయన తన తండ్రి వెంటే ఉంటూ పలువురు రాజకీయ ప్రముఖులను కూడా కలిసిన సంగతి మనకు తెలిసిందే.

Related News

ట్రెండింగ్ వార్తలు