పవన్ మూవీ జర్నీ పై స్పెషల్ వీడియో చేసిన అకీరా.. ఖుషీ అవుతున్న మెగా ఫాన్స్?

June 6, 2024

పవన్ మూవీ జర్నీ పై స్పెషల్ వీడియో చేసిన అకీరా.. ఖుషీ అవుతున్న మెగా ఫాన్స్?

సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికయ్యారు. త్వరలోనే ఈయన ఏపీ ప్రభుత్వంలో కీలక పదవులను కూడా అధిరోహించబోతున్నారని తెలుస్తోంది. ఇలా పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతుందని చెప్పాలి. ఇకపోతే పవన్ కళ్యాణ్ కు తన కుమారుడు అకీరా ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఇచ్చారు. ఎన్నికలలో ఆయన గెలుపు అందుకోవడంతో ఆయన తన తండ్రి కోసం ఎడిట్ చేసిన ఒక వీడియోని విడుదల చేశారు.

పవన్ కళ్యాణ్ నటించిన మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు తన మూవీ జర్నీ గురించి అఖీరా ఒక వీడియోని ఎడిట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో రేణు దేశాయ్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఇలా అకిరా ఎడిట్ చేసిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి రేణు దేశాయ్ తన కొడుకుకి తన తండ్రిపై ఎంత ప్రేమ ఉందనే విషయాన్ని వెల్లడించారు.

ఈ వీడియోని షేర్ చేసిన రేణు దేశాయ్ కొద్ది రోజుల క్రితమే వాళ్ళ నాన్న కోసం అకీరా ఈ వీడియో ఎడిట్ చేశారని క్యాప్షన్ పెట్టారు.పవన్ జర్నీ వీడియోను అకిరా షేర్ చేయమని తనకు చెప్పాడని రేణు దేశాయ్ తెలిపారు. అకిరా ఫోన్ చేసి నాన్న జర్నీ వీడియో షేర్ చేయమని చెప్పాడు. అకిరా ఆనందం కోసం ఇది షేర్ చేశాను. నా లిటిల్ బాయ్‌కు వాళ్ల నాన్న అంటే అమితమైన ప్రేమ, తండ్రి జర్నీపై తనయుడి గర్వానికి ఇది నిదర్శనం అని ఈమె తెలిపారు.

ఇక ఈ వీడియోలో ఖుషి సినిమా నుంచి మొదలుకొని భీమ్లా నాయక్ సినిమా వరకు కూడా కొన్ని డైలాగ్స్ అన్నింటిని కూడా ఎడిట్ చేసి క్రియేట్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసినటువంటి మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read More: నటి హేమకు ఊహించని షాకిచ్చిన మంచు విష్ణు.. మా సభ్యత్వం రద్దు చేస్తూ!

ట్రెండింగ్ వార్తలు