కల్కి ట్రైలర్ పై రియాక్ట్ అయిన నాగార్జున.. అంతా మంచే జరగాలంటూ?

June 24, 2024

కల్కి ట్రైలర్ పై రియాక్ట్ అయిన నాగార్జున.. అంతా మంచే జరగాలంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు నాగార్జున. అక్కినేని నాగేశ్వరరావు వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు . ఇక ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న నాగార్జున సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు. ఇక ఈయన బాగా వైరల్ అవుతున్న విషయాలపై మాత్రమే అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటారు.

నాగార్జున తన ఫ్యామిలీకి సంబంధించిన ఎన్నో రకాల రూమర్ల సోషల్ మీడియాలో వినిపించినా కూడా వాటిపై పెద్దగా స్పందించరు అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎవరైనా సెలబ్రిటీలు మరణించిన వారికి ఏదైనా జరిగినా కూడా ఈయన పెద్దగా స్పందించరు. ఇలా సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండే నాగార్జున మొదటిసారి కల్కి సినిమా ట్రైలర్ పై స్పందిస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ నటించిన ఈ సినిమా జూన్ 27వ తేదీ భారీ స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ అన్నీ కూడా పూర్తి అయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను కూడా పెంచేసింది. ఇక ఈ ట్రైలర్ వీడియో పై నాగార్జున స్పందిస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎంతో అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించావు నాగీ. మహత్తరమైన మన భారతీయ కథలను వెండితెర పైకి తీసుకువస్తుండడం చాలా ఆనందాన్ని కలగ చేస్తోంది. ఈ సినిమాని ఎప్పుడు చూద్దామా అని చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. అమితాబ్ బచ్చన్ ఇరగదీశారు… కమల్ హాసన్ అదరగొట్టేశారు. ప్రభాస్… ప్రయోగాలు చేసేందుకు నువ్వు ఏమాత్రం వెనుకాడవు… నీలో ఆ గుణాన్ని నేను అభిమానిస్తాను. ఇక నా ఫేవరెట్ ప్రొడ్యూసర్లు అశ్వినీదత్, స్వప్న, స్వీటీలకు ఆల్ ది బెస్ట్. మీ సత్తా నిరూపించుకున్నారు. చిత్ర బృందానికి దేవుడి ఆశీస్సులు ఉండాలని, అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అంటూ నాగార్జున చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Read More: కన్నప్ప సినిమాలో కాకుండా ప్రభాస్ గెస్ట్ రోల్ చేసిన మరో సినిమా ఏంటో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు