డిసెంబర్ 20న బచ్చల మల్లి

November 20, 2024

డిసెంబర్ 20న బచ్చల మల్లి

అల్లరి నరేష్ యూనిక్ మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ బచ్చల మల్లి. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించిన ఈ చిత్రం థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేసినట్లుగా, బచ్చల మల్లి డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల బెనిఫిట్ వుంటుంది కాబట్టి సినిమా థియేటర్లలోకి రావడానికి ఇది పర్ఫెక్ట్ టైం. రిలీజ్ డేట్ పోస్టర్ నరేష్ రగ్గడ్ న్యూ లుక్‌లో అందరిద్రుష్టిని ఆకర్షించింది. చెదిరిన జుట్టు, గుబురు గడ్డంతో, సిగరెట్ తాగుతూ నరేష్ ఇంటెన్స్ అవతార్ అదిరిపోయింది. అమృత అయ్యర్ కథానాయికగా కనిపించనున్న ఈ చిత్రానికి సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు